పోర్న్ చిత్రాలు.. నటి శిల్పాశెట్టి భర్త అరెస్ట్

బాలీవుడ్ బ్యూటీ శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాని పోలీసులు అరెస్టు చేశారు. పోర్నోగ్రఫీకి సంబంధించి ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్లు ముంబయి పోలీసులు తెలిపారు.

పోర్న్ వీడియోలను షూట్ చేసి యాప్స్ ద్వారా సర్క్యులేట్ చేస్తున్నారని రాజ్ కుంద్రాపై ఆరోపణలు ఉన్నాయి. ఫిబ్రవరిలో కేసు కూడా నమోదైంది. పలు కీలక ఆధారాలు కూడా సేకరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే మరిన్ని వివరాలు రాబట్టేందుకు కుంద్రాను అదుపులోకి తీసుకున్నారు.

ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఇందుకు సంబంధించిన కేసు నమోదయ్యిందని, ఈ కేసులో రాజ్ కుంద్రా ప్రధాన సూత్రధారిగా ఉన్నాడని పోలీసులు చెప్పుకొచ్చారు. తమ వద్ద కుంద్రా ఇందులో కీలక సూత్రధారి అనడానికి బలమైన ఆధారాలున్నట్టుగా కూడా పోలీసులు స్పష్టం చేసారు. కాగా..దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.