మంచి సినిమా తీయడమే కాదు.. దాన్ని సరిగ్గా మార్కెట్ చేయడమూ ముఖ్యమే. ఈ విషయాన్ని దర్శక ధీరుడు రాజమౌళి బాగానే అర్థం చేసుకున్నాడు. ఒకప్పుడు ప్రమోషన్ల గురించి పెద్దగా పట్టించుకునేవాడు కాదు కానీ.. తన సినిమాలు తెలుగు రాష్ట్రాలను దాటి ఇతర భాషల వాళ్లనూ ఆకట్టుకోవడం.. తన మార్కెట్ విస్తరించడంతో ప్రమోషన్ల మీద కూడా గట్టిగానే దృష్టిసారిస్తున్నాడు. ‘బాహుబలి’ అనే తెలుగు సినిమాను దేశంలోని అన్ని భాషల వాళ్ల దగ్గరకూ చేర్చడంలో చిత్ర బృందం అనుసరించిన ప్రమోషనల్ స్ట్రాటజీ గురించి ఎంత చెప్పినా తక్కువే.
‘బాహుబలి: ది కంక్లూజన్’కు ప్రత్యేకంగా ప్రమోషన్లు అవసరం పడలేదు కానీ.. ‘ది బిగినింగ్’ మీద దేశవ్యాప్తంగా ముందే అంచనాలు నెలకొనేలా చేయడంలో ప్రమోషన్ కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు జక్కన్న తీస్తున్న ‘ఆర్ఆర్ఆర్’కు కూడా ఒక ప్రణాళిక ప్రకారం ప్రమోషన్లు జరుగుతున్నాయి.
ముందుగా రిలీజ్ చేసిన టైటిల్ టీజర్.. ఆపై హీరోలిద్దరి మీద రిలీజ్ చేసిన టీజర్లు.. పోస్టర్లు వారెవా అనిపించాయి. ఇటీవలే రిలీజ్ చేసిన మేకింగ్ వీడియో సినిమాపై అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఐతే సినిమా రిలీజ్ సమయానికి హైప్‌ను మరింత పీక్స్‌కు తీసుకెళ్లేలా ప్రమోషన్లు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తదితరులపై ఒక ప్రమోషనల్ సాంగ్ కూడా తీస్తున్నారట. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో దీని చిత్రీకరణ జరుగుతున్నట్లు సమాచారం. ఈ పాట సినిమాలో ఉండదని.. కేవలం ప్రమోషన్ కోసమే ఉపయోగించనున్నారని తెలిసింది.
రాజమౌళి సినిమాకు ఇలా ప్రమోషనల్ సాంగ్ చేయడం ఇదే తొలిసారి. మరి అదెంత ప్రత్యేకంగా ఉంటుందో చూడాలి. దీని చిత్రీకరణ పూర్తి చేశాక ఒక భారీ పాట షూటింగ్ కోసం కోసం చరణ్, తారక్ అండ్ టీం జార్జియాకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత అంచనాల ప్రకారం అయితే అక్టోబరు 13న ‘ఆర్ఆర్ఆర్’ విడుదల కావాల్సి ఉంది.
This post was last modified on July 18, 2021 11:23 am
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…