తెలంగాణలో థియేటర్ల పున:ప్రారంభం.. 100 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడిపేందుకు అనుమతి.. రేపట్నుంచే తెరుచుకోనున్న వెండితెరలు.. శనివారం సాయంత్రం ఎలక్ట్రానిక్ మీడియాలో, సోషల్ మీడియాలో హోరెత్తిపోయిన వార్తలివి. కరోనా సెకండ్ వేవ్ తర్వాత దేశంలో 100 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు పున:ప్రారంభం కానున్న తొలి రాష్ట్రం తెలంగాణే అంటూ నేషనల్ మీడియాలో కూడా వార్తలొచ్చేశాయి.
ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కొందరు పోస్టులు కూడా పెట్టేశారు. కానీ తీరా చూస్తే తెలంగాణ ఫిలిం ఛాంబర్ పెద్దలు మీడియాకు లేటుగా అసలు విషయం చెప్పారు. తెలంగాణలో థియేటర్ల పున:ప్రారంభంపై ఇంకా నిర్ణయం ఏమీ జరగలేదని వాళ్లు తేల్చేశారు. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ను తాము కలిసి థియేటర్లు, సినీ పరిశ్రమలోని ఇతర సమస్యల గురించి విన్నవించామని, ఆయన సానుకూలంగా స్పందించారని.. ఐతే ఇప్పటి వరకు తెలంగాణలో థియేటర్ల పున:ప్రారంభంపై ఎలాంటి క్లారిటీ రాలేదని.. రేపట్నుంచి థియేటర్ల పున:ప్రారంభం అంటూ జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని మీడియాకు తెలంగాణ ఫిలిం ఛాంబర్ తరఫున మెసేజ్ రావడం గమనార్హం.
మంత్రిని ఫిలిం ఛాంబర్ పెద్దలు కలిసిన కాసేపటికే ఇండస్ట్రీ నుంచే ఎవరో థియేటర్ల పున:ప్రారంభం గురించి మీడియాకు చెప్పడం.. ఆ సమాచారాన్ని అందరూ షేర్ చేయడంతో అది వైరల్ కావడం చకచకా జరిగిపోయాయి. ఐతే కరెంటు బిల్లుల రద్దు, టికెట్ల రేట్ల పెంపు, అదనపు షోలు తమ విన్నపాలకు ఆమోదం లభిస్తే తప్ప థియేటర్ ఇండస్ట్రీ కోలుకోవడం కష్టమని.. ఆ మేరకు హామీలు వచ్చాకే థియేటర్లు ఓపెన్ చేయాలని ఎగ్జిబిటర్లు పట్టుదలతో ఉన్నారు. ఇదేమీ తేలకుండానే థియేటర్ల పున:ప్రారంభం అని ప్రచారం సాగుతుండటంతో ఫిలిం ఛాంబర్ పెద్దలు ఈ వార్తను ఖండిస్తూ మీడియాకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.
This post was last modified on July 18, 2021 10:21 am
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…