ఒకప్పుడు హీరోగా ఎన్నో సినిమాలు చేసిన నటుడు రాజశేఖర్ ఆ తరువాత జోరు తగ్గించారు. ఆయన నటించిన సినిమాలన్నీ ప్లాప్ అవుతుండడంతో కాస్త బ్రేక్ తీసుకున్నారు. ‘గరుడ వేగ’ సినిమాలో హీరోగా నటించి హిట్టు సినిమా తన ఖాతాలో వేసుకున్నారు.
‘కల్కి’ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోయినా.. ఏవరేజ్ అనిపించుకుంది. ఇదిలా ఉండగా.. మంచి పాత్ర దొరికితే మల్టీస్టారర్ సినిమాలతో పాటు విలన్ పాత్రలు చేయడానికి కూడా తను సిద్ధమని గతంలో రాజశేఖర్ ప్రకటించారు.
హీరోగా మార్కెట్ పడిపోయిన సమయంలో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రయత్నించాలనుకున్నారు. కానీ అలాంటి అవకాశాలు రాలేదు. నిజానికి ‘అఖండ’ సినిమాలో ముందుగా రాజశేఖర్ ను విలన్ గా తీసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. కానీ బోయపాటి తన ఫేవరెట్ యాక్టర్ జగపతిబాబునే తీసుకున్నారు. అయితే ఇప్పుడు ఓ సినిమా కోసం రాజశేఖర్ ను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది.
హీరో గోపీచంద్-శ్రీవాస్ కాంబినేషన్ లో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో ఓ పాత్ర కోసం రాజశేఖర్ ను తీసుకోవాలనుకుంటున్నారు. ఇది విలన్ రోల్ మాత్రం కాదట. కథను మలుపు తిప్పే కీలకపాత్రలో రాజశేఖర్ ను తీసుకోవాలనుకుంటున్నారు.
కానీ రాజశేఖర్ హీరోగా చాలా సినిమాలు ఒప్పుకుంటున్నారు. రీసెంట్ గానే రెండు సినిమాలు అనౌన్స్ చేశారు. మరి ఇలాంటి సమయంలో గోపీచంద్ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపిస్తారో లేదో చూడాలి!
This post was last modified on July 17, 2021 8:39 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కువైట్లో పర్యటిస్తున్నారు. 43 ఏళ్ల తర్వాత.. భారత ప్రధాని కువైట్లో పర్యటించడం ఇదే తొలిసారి. శనివారం…
ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…