దర్శక ధీరుడు రాజమౌళి సినిమా అంటే భారీతనానికి కేరాఫ్ అడ్రస్. అందులో కష్టం మామూలుగా ఉండదు. గతంలో ‘మగధీర’ తీశాక రిలీఫ్ కోసం అన్నట్లు ‘మర్యాదరామన్న’ పేరుతో ఓ చిన్న సినిమా తీశాడు కానీ.. ‘బాహుబలి’ తర్వాత మాత్రం ఆయన అలా రేంజ్ తగ్గించుకోవడానికి అవకాశమే లేకపోయింది.
జక్కన్నపై దేశవ్యాప్తంగా అంచనాలు భారీగా పెరిగిపోవడం, ఆయన సినిమా అనగానే భారీతనం ఆశిస్తుండటంతో జక్కన్నకు ఇష్టమున్నా లేకపోయినా బిగ్ కాన్వాస్‌లోనే సినిమా తీయాల్సిన పరిస్థితి నెలకొంది. ఐతే ‘ఆర్ఆర్‌ఆర్’ తొలి ప్రెస్ మీట్లో జక్కన్న మాట్లాడుతూ.. ‘బాహుబలి’లా ఇందులో గ్రాఫిక్స్‌కు అంత ప్రాధాన్యం ఉండదని, ఇది ఒక సోషల్ మూవీనే అని చెప్పాడు.
చిత్ర వర్గాలు కూడా ‘ఆర్ఆర్ఆర్’లో ‘బాహుబలి’ స్థాయి భారీతనం ఉండదన్నట్లుగా చెప్పుకున్నాయి. ఇప్పటిదాకా రిలీజ్ చేసిన హీరోల టీజర్లు, ఇతర ప్రోమోల్లో కూడా మరీ భారీతనం ఏమీ కనిపించలేదు.
కానీ తాజాగా రిలీజ్ చేసిన ‘ఆర్ఆర్ఆర్’ మేకింగ్ వీడియో చూశాక భారీతనంలో ఇది ‘బాహుబలి’కి ఏమాత్రం తీసిపోదని అర్థమైపోయింది. ‘బాహుబలి’కి దీటైన సెట్టింగ్స్ కనిపించాయి మేకింగ్ వీడియోలో. అలాగే యాక్షన్ ఘట్టాలు అలా ఇలా ఉండవన్న సంకేతాలు కనిపించాయి. ‘ఆర్ఆర్ఆర్’లో గ్రాఫిక్స్ పెద్దగా ఉండవన్న మాట కూడా నిజం కాదని అర్థమవుతోంది.
కచ్చితంగా విజువల్ ఎఫెక్ట్స్‌కు మంచి ప్రాధాన్యమే ఉంటుందని మేకింగ్ వీడియోతో స్పష్టమైంది. మొత్తంగా చూస్తే ఈ భారీతనం, ఎఫెక్ట్స్ అనేవి రాజమౌళి వదులకోలేని బలహీనతలుగా మారిపోయాయన్నది స్పష్టం.
ఐతే అదేమీ ఆయనకు మైనస్ కాదు. జక్కన్న సినిమా అంటే ప్రేక్షకులు ప్రతిదీ భారీగా, అసాధారణంగా ఆశిస్తున్నారు. దానికి తక్కువగా ఉంటే పెదవి విరచడం ఖాయం. కాబట్టి రేప్పొద్దున మహేష్ బాబుతో సినిమా తీసినా.. ఆ తర్వాత ఇంకో సినిమా చేసినా.. ‘మహాభారతం’ను లైన్లో పెట్టి భారీతనానికి మాత్రం లోటుండకూడదన్నమాటే.
This post was last modified on July 16, 2021 5:18 pm
వైసీపీ ప్రభుత్వం అండ చూసుకొని సోషల్ మీడియాలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, వారి కుటుంబ సభ్యులపై అసభ్యరమైన పోస్టులు…
ఈ రోజు సోషల్ మీడియా అంతటా ధనుష్-నయనతార గొడవ గురించే చర్చ. ధనుష్ మీద తీవ్ర విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తూ నయనతార…
ప్రభాస్ తన లైనప్ లో ఎన్ని క్రేజీ కాంబినేషన్స్ సెట్ చేసినా కూడా హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఫోకస్ మాత్రం…
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షం వైసీపీ లేని లోటును టీడీపీ ఎమ్మెల్యేలే తీర్చేస్తున్నారు. నిజానికి వైసీపీ ఉంటే కూడా ఇంతగా…
టాలీవుడ్లో అయినా.. మొత్తం ఇండియాలో అయినా… సోషల్ మీడియాలో అత్యధిక ట్రోలింగ్ ఎదుర్కొన్న మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే మరో…
మాములుగా ఎంత పెద్ద సినిమా అయినా సరే మూడో వారంలోకి వచ్చాక నెమ్మదించడం సహజం. కానీ అమరన్ మాత్రం ఈ…