మూవీ ఆర్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు.. హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఓ వైపు ప్రకాష్ రాజ్, మరో వైపు మంచు విష్ణు తలపడుతుండటంతో.. దీనిపై తీవ్ర ఆసక్తి పెరిగింది. వీరిద్దరిలో ఎవరి మద్దుతు ఎవరికి అనే విషయం మరింత తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది.
కాగా.. తాజాగా.. ఈ మా ఎన్నికలపై సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ స్పందించారు. “మా” ఎన్నికల విషయంలో లోకల్, నాన్ లోకల్ అనే బేధాన్ని తాను పట్టించుకోనని ఆయన స్పష్టం చేశారు. అయితే “మా ” బిల్డింగ్ ఇంతవరకు ఎందుకు కట్టలేకపోయారన్నదే తన ప్రశ్న అని బాలయ్య పేర్కొన్నారు. తెలంగాణ సర్కార్‌తో రాసుకుపూసుకు తిరుగుతున్నారని.. ” మా ” బిల్డింగ్ కోసం అడిగితే ఒక ఎకరం ఇవ్వరా అని బాలయ్య ప్రశ్నించారు.
” మా ” బిల్డింగ్ నిర్మాణం కోసం విష్ణు ముందుకొస్తే తానూ సహకరిస్తానని బాలకృష్ణ స్పష్టం చేశారు. అందరం కలిస్తే.. ఇంద్ర భవనం నిర్మించొచ్చని ఆయన పేర్కొన్నారు. ఫండ్ రైజింగ్ కోసం ఫస్ట్‌క్లాస్‌లో అమెరికాలో తిరిగారని.. ఆ డబ్బంతా ఏం చేశారని బాలకృష్ణ ప్రశ్నించారు. మనది గ్లామర్ ఇండస్ట్రీ అని.. సమస్యలు బహిరంగంగా చర్చించడం సరికాదని ఆయన హితవు పలికారు.
This post was last modified on July 15, 2021 5:55 pm
రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు అనగానే మహిళలే గుర్తుకు వస్తారు. ఎందుకంటే.. డ్వాక్రా అంటే.. స్వయం సహాయక మహిళా సంఘాలు!…
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…