లాక్ డౌన్ సమయాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబు లాగా ఎంజాయ్ చేస్తున్న హీరో టాలీవుడ్లో మరొకరు ఉండరేమో. అతను కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న ఫొటోలు, వీడియోలు అలాంటి ఫీలింగే కలిగిస్తున్నాయి మరి. మామూలుగానే ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి చాలా ఇష్టపడతాడు మహేష్. లాక్ డౌన్ టైంలో అతను మరింతగా ఫ్యామిలీతో బంధాన్ని పెంచుకుంటున్నాడు. తన కొడుకు, కూతురితో కలిసి ఇప్పటికే అనేక సరదా ఫొటోలు, వీడియోలు షేర్ చేశాడు. తాజాగా మహేష్ ఒక ఆసక్తికర వీడియో పెట్టాడు. తన కొడుకును తన ముందు నిలబెట్టి అతనెంత ఎదిగిపోయాడో చూపించాడు మహేష్.
మహేష్ భుజాన్ని దాటి ఎదిగిపోయిన.. అతడి కంటే ఒక మూణ్నాలుగు అంగుళాలు మాత్రమే తక్కువ ఉన్నట్లు కనిపిస్తున్నాడు గౌతమ్. ప్రస్తుతం గౌతమ్ వయసు 14 ఏళ్లే. కాబట్టి టీనేజీ దాటేసరికి తండ్రిని మించి ఎత్తుకు చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక మహేష్ విషయానికి వస్తే లాక్ డౌన్ టైంలో మరింత ఛార్మింగ్‌గా తయారైన అతను.. గ్లామర్ విషయంలో కొడుకుతో పోటీ పడుతున్నాడు. వాళ్లిద్దరినీ పక్క పక్కన పెట్టి చూస్తే అన్నదమ్ముల్లా కనిపిస్తున్నారు. అలాంటి ఫొటోలు, వీడియోలే షేర్ చేస్తున్నాడతను. మొత్తంగా ఈ సమయాన్ని చాలా చక్కగా ఉపయోగించుకుంటూ నెవ్వర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్లుగా ఎంజాయ్ చేస్తున్న మహేష్‌ను చూసి అభిమానులు కూడా మురిసిపోతున్నారు.
This post was last modified on May 23, 2020 9:22 am
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…