Movie News

ఆ లెజెండ్ స్థానంలోకి ఇంకో లెజెండ్


భార‌తీయ సినీ ప‌రిశ్ర‌మ గ‌ర్వించ‌ద‌గ్గ న‌టుల్లో ఇర్ఫాన్ ఖాన్ ఒక‌డు. హిందీలో అత‌ను చేసిన చిత్రాల‌తో ఎంత గొప్ప పేరు సంపాదించాడో కొత్త‌గా చెప్పాల్సిన ప‌ని లేదు. ఆ పేరుతోనే హాలీవుడ్లో లైఫ్ ఆఫ్ పై, జురాసిక్ వ‌ర‌ల్డ్ లాంటి భారీ చిత్రాల్లో కీల‌క పాత్ర‌లు ద‌క్కించుకున్నాడు. వాటితోనూ స‌త్తా చాటాడు. కానీ ఈ లెజెండ‌రీ న‌టుడు గ‌త ఏడాది అర్ధంత‌రంగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు. కొన్నేళ్ల కింద‌ట అరుదైన క్యాన్స‌ర్ బారిన ప‌డి.. దాంతో పోరాడిన ఇర్ఫాన్ నిరుడు కొవిడ్ టైంలో త‌నువు చాలించాడు.

అనారోగ్యం పాల‌య్యాక మ‌ధ్య‌లో ఆగిపోయిన అంగ్రేజీ మీడియంను పూర్తి చేశాడు కానీ.. అత‌ను అంగీకారం తెలిపిన వేరే సినిమాల‌కు ప్ర‌త్యామ్నాయాలు చూసుకోక త‌ప్ప‌లేదు. అందులో ఒక‌టి.. టికు వెడ్స్ షేరు. కంగ‌నా ర‌నౌత్ సొంత నిర్మాణ సంస్థ మ‌ణిక‌ర్ణిక ఫిలిమ్స్ నిర్మాణంలో మొదలు కావాల్సిన తొలి చిత్ర‌మిది.

ఈ సినిమాను ప్ర‌క‌టించాక ఇర్పాన్ అనారోగ్యం బారిన ప‌డ‌టంతో దీన్ని ముందుకు తీసుకెళ్ల‌లేక‌పోయారు. ఇర్ఫాన్ కోలుకుని ఈ సినిమా చేస్తాడ‌ని అనుకున్నారు కానీ.. అది జ‌ర‌గ‌లేదు. దీంతో మ‌రింత టైం తీసుకుని ఎట్ట‌కేల‌కు ఈ సినిమాను ప‌ట్టాలెక్కించ‌డానికి రంగం సిద్ధం చేశారు. ఇర్ఫాన్ త‌ర్వాత అంత గొప్ప న‌టుడిగా పేరు సంపాదించిన మ‌రో లెజెండ‌రీ న‌టుడు న‌వాజుద్దీన్ సిద్ధిఖి ఈ చిత్రంలో న‌టించ‌నున్నాడు. ఇర్ఫాన్‌కు ఇంత‌కంటే మంచి రీప్లేస్మెంట్ మ‌రొక‌టి ఉండ‌ద‌న‌డంలో సందేహం లేదు.

టైటిల్లో షేరు అన్న ప‌దం న‌వాజ్‌ను సూచించేదే. వెల్క‌మ్ టు అవ‌ర్ ల‌య‌న్ అంటూ త‌మ ప్రాజెక్టులోకి న‌వాజ్‌కు కంగ‌నా ఆహ్వానం ప‌లికింది. ఈ చిత్రానికి కంగ‌నానే ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుంద‌ని.. లేదా ఆమె ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో మ‌రో డైరెక్ట‌ర్ ఈ సినిమా తీస్తార‌ని అంటున్నారు. మ‌ణిక‌ర్ణిక చిత్రాన్ని క్రిష్ పూర్తి చేశాక‌.. కంగ‌నా స్వ‌యంగా ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌లు తీసుకుని రీషూట్లు చేయ‌డం తెలిసిందే.

This post was last modified on July 15, 2021 10:41 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

బాబు ఐడియా: డ్వాక్రా పురుష గ్రూపులు!

రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు అన‌గానే మ‌హిళ‌లే గుర్తుకు వ‌స్తారు. ఎందుకంటే.. డ్వాక్రా అంటే.. స్వ‌యం స‌హాయ‌క మ‌హిళా సంఘాలు!…

30 minutes ago

మ‌ళ్లీ పాత‌కాల‌పు బాబు.. స‌ర్ ప్రైజ్ విజిట్స్‌కు రెడీ!

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌ళ్లీ పాత‌కాల‌పు పాల‌న‌ను ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేయ‌నున్నారా? ప్ర‌భుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల ప‌నుల ను ఆయ‌న…

7 hours ago

షోలే, డిడిఎల్ కాదు….ఇకపై పుష్ప 2 సింహాసనం!

సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…

8 hours ago

అభిమాని గుండెల‌పై చంద్ర‌బాబు సంత‌కం!

ఏపీ సీఎం చంద్ర‌బాబు 45 ఏళ్లుగా రాజ‌కీయాల్లో ఉన్నారు. ఇప్ప‌టికి మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…

9 hours ago

సినిమా నచ్చకపోతే డబ్బులు వాపస్…అయ్యే పనేనా?

థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…

9 hours ago