రంజాన్ వచ్చిందంటే చాలు.. బాలీవుడ్ బాక్సాఫీస్ షేక్ అయిపోవాల్సిందే. దశాబ్ద కాలంగా నడుస్తున్న సంప్రదాయం ఇది. ఈద్‌కి కర్చీఫ్ వేసి కూర్చుంటాడు సల్మాన్ ఖాన్. 2013లో మినహాయిస్తే 2009 నుంచి ప్రతిసారీ రంజాన్‌కు అతడి సినిమా రిలీజవుతూ వస్తోంది. టాక్‌తో సంబంధం లేకుండా అతడి సినిమాలు ఈద్‌కు వసూళ్ల మోత మోగిస్తాయి. గత ఏడాది కూడా ‘భారత్’ సినిమా తొలి వారాంతంలో భారీగా వసూళ్లు రాబట్టింది. 2009లో ‘వాంటెడ్’తో సల్మాన్ రంజాన్ ప్రభంజనం మొదలైంది. ఆ తర్వాత వరుసగా దబంగ్, బాడీగార్డ్, ఏక్ థా టైగర్, కిక్, భజరంగి భాయిజాన్, సుల్తాన్, ట్యూబ్ లైట్, రేస్-3 సినిమాలు రంజాన్‌కు విడుదలై ప్రేక్షకుల్ని అలరించాయి. ఈ ఏడాది కూడా సల్మాన్ ‘రాధె’ సినిమాతో ఈద్‌కు ట్రీట్ ఇవ్వాలనుకున్నాడు. కానీ కరోనా వచ్చి అతడి ఆశలకు బ్రేక్ వేసింది.
మామూలుగా రంజాన్‌కు సల్మాన్ సినిమా ఉందంటే దానికి ఎదురెళ్లే సాహసం ఎవ్వరూ చేయరు. కానీ ఈసారి మాత్రం దానికి పోటీగా అక్షయ్ కుమార్ సినిమా ‘లక్ష్మీబాంబ్’ను రిలీజ్ చేయాలనుకున్నారు. వేసవి కాబట్టి ఒకే వారాంతంలో రెండు సినిమాలు రిలీజైనా ఇబ్బంది ఉండదనుకున్నారు. ఆదివారం (మే 24) రంజాన్ నేపథ్యంలో ఈ శుక్రవారం (మే 22న) ఈ రెండు చిత్రాలు విడుదల కావాల్సింది. ఇలాంటి రెండు భారీ చిత్రాలు విడుదలైతే బాక్సాఫీస్ షేక్ అయిపోయేదే. అటు ఇటుగా రూ.400 కోట్ల మేర బిజినెస్ జరిగేది. కానీ కరోనా పుణ్యమా అని ఇప్పుడు థియేటర్లన్నీ మూతబడి ఉన్నాయి. రెండు నెలలకు పైగా లాక్ డౌన్ నడుస్తుండటంతో భారతీయ సినీ పరిశ్రమ వేల కోట్లలో నష్టపోయింది. బంగారం లాంటి వేసవి సీజన్ ఇలా వృథా అయిపోతుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. ‘రాధె’ షూటింగ్ పెండింగ్ పడటంతో ఈ ఏడాది చివరికి సినిమా వాయిదా పడేలా ఉంది.
This post was last modified on May 23, 2020 9:22 am
తమిళనాడు సిఎం విజయ్ వారసుడిగా జేసన్ సంజయ్ హీరోగా తెరంగేట్రం చేసి ఉంటే ఈపాటికి అభిమానులు, నిర్మాతలు రెడ్ కార్పెట్…
హిందీలో దృశ్యం 3 బాగా ఆడుతున్న టైంలో టాలీవుడ్ ప్రేక్షకులకు వస్తున్న సందేహం ఒకటుంది. ఒకవేళ వెంకటేష్ కనక మూడో…
చైనాలో సోషల్ మీడియా ట్రెండ్‌లు, ఫొటోషూట్‌ల సంస్కృతిలో కొత్త మార్పు కనిపిస్తోంది. ప్రస్తుతం కొందరు యువతులు మేల్ మోడల్స్‌తో ప్రత్యేకంగా…
కాక్రోచ్ పార్టీ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. నీట్ పేపర్ లికేజి వ్యవహారంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర చేపట్టిన…
రాజమౌళి ఫ్యామిలీ మొత్తం ప్రమోషన్లు చేసింది. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా పొడవైన ట్వీట్ రివ్యూలతో సినిమాను మెచ్చుకున్నారు.…
దసరా పండక్కు భారీ పోటీ నెలకొనడం చూస్తున్నాం. సంక్రాంతి రేంజులో మూడు పెద్ద సినిమాలు క్యూ కట్టడం బయ్యర్ వర్గాల్లో…