విక్టరీ వెంకటేష్ ఇంకో ఆరు రోజుల్లోనే తన కొత్త చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘నారప్ప’ ఈ నెల 20న అమేజాన్ ప్రైమ్ ద్వారా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం దీని ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ చిత్రం తమిళ బ్లాక్‌బస్టర్ ‘అసురన్’కు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. చాలా వయొలెంట్‌గా సాగే ఈ సినిమాను సున్నితమైన కుటుంబ కథా చిత్రాలకు పేరుబడ్డ శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేయడం విశేషం.
అతను ఒరిజినల్‌లో కొన్నయినా మార్పులు చేర్పులు చేసి ఉంటాడని.. తనదైన టచ్ ఇచ్చే ప్రయత్నం చేసి ఉంటాడని అనుకున్నారు ప్రేక్షకులు. కానీ ట్రైలర్ చూస్తే అలాంటి ఆశలేమీ పెట్టుకోవాల్సిన అవసరం లేదని స్పష్టమవుతోంది. ఒరిజినల్ నుంచి సీన్ టు సీన్ ఉన్నదున్నట్లు దించేసినట్లుగా కనిపిస్తోంది. ట్రైలర్లో కనిపించిన ప్రతి షాట్ ‘అసురన్’లో చూసిందే కావడం గమనార్హం. దాంతో పోలికలను పక్కన పెట్టేసి మామూలుగా చూస్తే ప్రేక్షకుల్లో బాగానే ఆసక్తిని రేకెత్తించేలా ఉంది ‘నారప్ప’ ట్రైలర్.
ఐతే బలమైన కథాకథనాలతో తెరకెక్కిన ‘అసురన్’లో ఈ సీన్ బాలేదు అంటూ ఏదీ ఉండదు. ఫ్లాష్ బ్యాక్ ఒక్కటి కొంచెం ల్యాగ్ అనిపిస్తుందంతే. దాని విషయంలో కూడా ‘నారప్ప’ టీం మార్పులేమీ చేసినట్లుగా లేదు. మాతృకను చెడగొట్టకుండా సేమ్ ఫీల్ తీసుకురావడానికి ప్రయత్నించినట్లుంది. లొకేషన్లు, అట్మాస్ఫియర్ అన్నీ కూడా ఒరిజినల్‌ను గుర్తుకు తెస్తున్నాయి. ‘అసురన్’లో ధనుష్‌ను పెద్ద వయస్కుడిగా చూడటం కాస్త ఇబ్బందిగా అనిపించగా.. ఇక్కడ వెంకీ పర్ఫెక్ట్ అనిపించాడు. ఆయన లుక్, స్క్రీన్ ప్రెజెన్స్, పెర్ఫామెన్స్ చాలా ఇంటెన్స్‌గా అనిపిస్తున్నాయి.
ఐతే ఫ్లాష్ బ్యాక్‌లో వచ్చే యుక్త వయస్కుడి పాత్రలో వెంకీ ఏమేర మెప్పిస్తాడో చూడాలి. ఒరిజినల్లో ఆ పాత్రకు జోడీగా చేసిన అమ్మాయే ఇక్కడా నటించింది. ఆమె వెంకీ పక్కన అస్సలు సూట్ కాకపోవచ్చు. మాతృకలో మెయిన్ విలన్ పాత్ర చేసిన ఆడుగళం నరేష్‌తోనే తెలుగులోనూ ఆ పాత్రను చేయించారు. మంజు వారియర్ పాత్రలో ప్రియమణి అదరగొట్టినట్లే ఉంది. పశుపతి పాత్రలో రాజీవ్ కనకాల కూడా బాగానే సూటయ్యాడు. సినిమాను జిరాక్స్ కాపీలా దించేయడంతో.. ‘అసురన్’ బ్యాగ్రౌండ్ స్కోర్‌ను యాజిటీజ్ వాడేసినట్లున్నారు. పాటల వరకు మణిశర్మ బాధ్యత తీసుకున్నాడు.
This post was last modified on July 14, 2021 2:11 pm
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…