90ల్లో బాగా సినిమాలు చూసి ఆస్వాదించిన ప్రేక్షకులకు ‘రోజా’ ఒక మరపురాని జ్ఞాపకం. మణిరత్నం ప్రతిభ ఏంటో దేశం మొత్తానికి తెలిసేలా చేసిన చిత్రమిది. ఇందులో టైటిల్ రోల్ పోషించిన మధుబాల, ఆమెకు జోడీగా నటించిన అరవింద్ స్వామిలకు ఎంత పేరొచ్చిందో.. ఆ జోడీ ప్రేక్షకులకు ఎంతగా నచ్చిందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. వీళ్లిద్దరూ కలిసి చేసింది ఒకే సినిమా.
కానీ ఆ సినిమాతో ఎవర్ గ్రీన్ పెయిర్ అనిపించుకున్నారు. వాళ్లిద్దరూ ప్రేక్షకులకు చిరకాలం గుర్తుండిపోతారు. మామూలుగా ఒక హిట్, క్లాసిక్ సినిమాలో నటించిన నటీనటుల్ని కలిపి మళ్లీ సినిమాలు తీయడం మామూలే.
కానీ ఎందుకోగానీ ఎవ్వరూ అరవింద్, మధులతో మళ్లీ ఓ సినిమా చేయలేదు. కథానాయికగా మధు కెరీర్ ఎక్కువ కాలం కొనసాగకపోవడం.. అరవింద్ స్వామి కూడా మధ్యలో బ్రేక్ తీసుకోవడం ఇందుకు కారణం కావచ్చు. ఐతే ఈ జోడీని దాదాపు మూడు దశాబ్దాల తర్వాత మళ్లీ కలిసి చూసే అవకాశం దక్కబోతోంది.
కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో ఎ.ఎల్.విజయ్ ‘తలైవి’ సినిమా తీసిన సంగతి తెలిసిందే. జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో అరవింద్ స్వామి ఎంజీఆర్ పాత్రలో కనిపించనున్నాడు. ఎంజీఆర్‌గా అతడి ట్రాన్స్‌ఫర్మేషన్ చూసి జనాలు అవాక్కవడం తెలిసిందే. ఈ పాత్రకు ఇంకెవరూ ఇంత బాగా నప్పరు అనిపించాడు.
ఇందులో ఎంజీఆర్ భార్యగా మధుబాల కనిపించనుందట. ఎంజీఆర్‌కు, జయలలితకు ఉన్న సంబంధం.. తర్వాత ఆమే ఆయన రాజకీయ వారసురాలిగా మారడం అప్పట్లో ఎంత చర్చనీయాంశం అయిందో తెలిసిందే. ఐతే భార్యకు కూడా ఎంజీఆర్ ఎంతో విలువ ఇచ్చాడని చెబుతారు. కాకపోతే ఆమె గురించి సామాన్య జనాలకు పెద్దగా తెలియదు.
మరి ‘తలైవి’లో ఈ జోడీని ఎలా ప్రెజెంట్ చేశారో చూడాలి. ఒక క్లాసిక్‌లో నటించిన జోడీ మూడు దశాబ్దాల తర్వాత ఇలా తెరపై కనిపించనుండటం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతుందనడంలో సందేహం లేదు.
This post was last modified on July 13, 2021 11:02 pm
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…
గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు…
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లోని పాలకులు, వ్యాపారవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సంగతి…
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై జరుగుతున్న విచారణలో రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి.ప్రకాశ్ కీలక సమాచారాన్ని…