కొన్ని సినిమాలు రిలీజైనపుడు ఓ మోస్తరుగా ఆడుతుంటాయి. కమర్షియల్‌గా మరీ పెద్ద సక్సెస్ ఏమీ సాధించవు. కానీ కాల క్రమంలో అవి క్లాసిక్స్ లాగా నిలిచిపోతాయి. చూడగా చూడగా ప్రేక్షకులకు అవి బాగా నచ్చేస్తాయి. వాటి గొప్పదనం లేటుగా అర్థమవుతుంది.
నాని సినిమా ‘జెర్సీ’ ఈ కోవకే చెందుతుంది. ‘మళ్ళీ రావా’ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి రూపొందించిన ఈ చిత్రం రెండేళ్ల కిందట విడుదలైంది. ఆ సినిమా ఆ సమయానికి హిట్టే అయింది కానీ.. దాని స్థాయికి పెద్ద బ్లాక్‌బస్టర్ కావాల్సిందని అంటారు జనాలు.
ఓటీటీలో, టీవీలో ఈ సినిమాకు గొప్ప స్పందనే వచ్చింది. ఈ చిత్రం ఇప్పుడు హిందీలో ‘జెర్సీ’ పేరుతోనే రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. షాహిద్ కపూర్ హీరోగా దిల్ రాజు, కరణ్ జోహార్ నిర్మాణంలో గౌతమే ఈ చిత్రాన్ని రూపొందించాడు. ఐతే దాని తర్వాత గౌతమ్ చేసే సినిమా గురించి ఇప్పటిదాకా రకరకాల ఊహాగాలు వచ్చాయి. కానీ అవేవీ నిజం కాలేదు.
ఐతే తాజా సమాచారం ప్రకారం గౌతమ్ మళ్లీ నానితో ఓ సినిమా చేయబోతున్నాడట. త్వరలోనే క్లాసిక్ కాంబినేషన్ రిపీట్ కానున్నట్లు తెలుస్తోంది. నాని హీరోగా ఈసారి ఓ సైనికుడి కథను ఉద్వేగభరితంగా చెప్పడానికి గౌతమ్ సిద్ధమవుతున్నాడట. యుద్ధ రంగంలో పోరాడి తన కాళ్లు పోగొట్టుకున్న ఓ వీర సైనికుడి కథ ఇదట. ‘
జెర్సీ’ తరహాలోనే కథలో చాలా వరకు ఫ్లాష్ బ్యాక్‌లో నడుస్తుందని.. ‘జెర్సీ’ని మించి ఇందులో భావోద్వేగాలకు అవకాశం ఉందని అంటున్నారు. త్వరలోనే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన వస్తుందని చెబుతున్నారు.
‘జెర్సీ’ హిందీ రీమేక్ అయ్యాక రామ్ చరణ్‌తో గౌతమ్ సినిమా ఉంటుందని గట్టిగానే ప్రచారం జరిగింది కానీ.. అది కార్యరూపం దాల్చలేదు. చరణ్.. శంకర్‌తో తన కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నాని ‘అంటే సుందరానికి’ సినిమాలో నటిస్తున్నారు. అతను నటించిన ‘టక్ జగదీష్’ విడుదలకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే.
This post was last modified on July 12, 2021 3:24 pm
రాయలసీమలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రముఖ…
దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…
సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…
ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…
కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…
ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…