టాలీవుడ్లో మంచి కలం బలం ఉన్న రచయితల్లో లక్ష్మీ భూపాల ఒకరు. చందమామ, అలా మొదలైంది, కళ్యాణ వైభోగమే, నేనే రాజు నేనే మంత్రి, ఓ బేబీ లాంటి సినిమాలతో ఆయన తన పెన్ పవర్ చూపించారు. భావోద్వేగాలకు ప్రాధాన్యమున్న చిత్రాలకు లక్ష్మీ భూపాల రైటింగ్ బాగా సూటవుతుందన్న పేరుంది. ప్రస్తుతం ఆయన నందిని రెడ్డి కొత్త చిత్రానికి పని చేస్తున్నారు.
చేతిలో మరికొన్ని సినిమాలున్నాయి. ఐతే లక్ష్మీ భూపాల పేరు వాడుకుని కొందరు ఇండస్ట్రీలో మోసాలకు పాల్పడుతుండటం ఆయనకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. తన దగ్గర పని చేశామని చెబుతూ.. అవకాశాలు అందుకోవడం, డబ్బులు దండుకోవడం గురించి తెలిసి ఫేస్ బుక్‌లో ఒక పోస్టు పెట్టారు లక్ష్మీభూపాల.
తన దగ్గర ఇప్పటిదాకా ఎవ్వరూ రచయితలుగా పని చేయలేదని, తనకు అలాంటి సపోర్ట్ కూడా అవసరం లేదని.. తాను కేవలం తన సామర్థ్యాన్ని నమ్ముకుని పని చేస్తున్నానని లక్ష్మీ భూపాల వ్యాఖ్యానించాడు. నాకు బ్రాంచీలు లేవు.. నా కేరాఫ్ అడ్రస్ నేనే.. అంటూ తన శైలిలో వ్యాఖ్యలు చేశారాయన.
“నా దగ్గర అసిస్టెంట్ రచయితగా పనిచేశానని, నాకే తెలీకుండా నా దగ్గర ఘోస్ట్ రైటర్‌గా పనిచేశానని ఈ మధ్య కొందరు మార్కెట్లో ఏ మాత్రం సిగ్గులేకుండా నా పేరు విచ్చలవిడిగా వాడేస్తున్నట్టు తెలిసింది. నా అసిస్టెంట్ అని చెప్పుకుంటూ కొందరు కొన్నిచోట్ల అడ్వాన్స్ తీసుకున్నారని తెలిసింది. నేను సినిమాల్లో మాటలు, పాటలు రాయడానికి ఇప్పటివరకు నా బుర్రని తప్ప ఇంకెవరి సహాయం తీసుకోలేదు, నాకు ఒక్క అసిస్టెంట్ కూడా లేడు. ఇకముందు కూడా ఆ అవసరం లేదు.. ఎందుకంటే నిర్మాత, దర్శకుడు నన్ను, నా బుర్రని నమ్మి డబ్బులిస్తారని నమ్ముతాను కాబట్టి.. అసిస్టెంట్లను పెట్టుకునే ఇతర రచయితల ఇబ్బందులు నాకు తెలీదు కాబట్టి వారి విషయంలో నేను మాట్లాడలేను. దర్శక నిర్మాతల్లారా దయచేసి ఇలాంటి వాళ్ళని నమ్మకండి ఎందుకంటే… నా కేరాఫ్ నేను మాత్రమే.. నాకెక్కడా బ్రాంచీల్లేవ్” అని లక్ష్మీభూపాల తన పోస్టులో పేర్కొన్నారు.
This post was last modified on July 10, 2021 1:18 pm
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…