ఎప్పుడో 2018లో విశ్వరూపం-2 సినిమాతో పలకరించాడు కమల్ హాసన్. ఐతే ఆ సినిమా కొన్నేళ్ల పాటు వాయిదా పడి చివరగా 2018లో రిలీజైంది. చివరగా రిలీజైన ఆయన రెగ్యులర్ మూవీ అంటే చీకటి రాజ్యం అనే చెప్పాలి. ఆ సినిమాను ప్రాపర్‌గా మొదలుపెట్టి.. పూర్తి చేసి మంచి అంచనాల మధ్య రిలీజ్ చేశాడు కమల్. ఆ సినిమా ప్రమోషన్లలో కూడా కమల్ హుషారుగా పాల్గొన్నాడు. దీని తర్వాత వచ్చిన విశ్వరూపం-2 సంగతి తెలిసిందే.
ఇక రెండేళ్ల కిందట మొదలుపెట్టిన ఇండియన్-2 సినిమా ఎటూ కాకుండా పోయింది. ఆ సినిమాను అలా సందిగ్ధంలో పెట్టేసి.. విక్రమ్ అనే కొత్త చిత్రాన్ని మొదలు పెట్టాడు కమల్. ఖైదీ, మాస్టర్ చిత్రాల దర్శకుడు లోకేష్ కనకరాజ్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు.
విక్రమ్ సినిమాను అనౌన్స్ చేసిన సందర్భంగా రిలీజ్ చేసిన ప్రి టీజర్ అమితాసక్తిని రేకెత్తించింది. ఇప్పుడు సినిమా రెగ్యులర్ షూటింగ్‌లోకి వెళ్లనున్న నేపథ్యంలో ముందే ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తున్నారు. కమల్ సినిమాకు సంబంధించి ప్రాపర్‌గా ఒక ఫస్ట్ లుక్ రిలీజై చాలా ఏళ్లవడంతో అభిమానులు ఎగ్జైట్ అవుతున్నారు. సోషల్ మీడియాలోనూ వాళ్లు యాక్టివ్ అవుతున్నారు. లోకనాయకుడు ఈజ్ బ్యాక్ అంటూ సందడి చేస్తున్నారు. శనివారం సాయంత్రం 5 గంటలకు విక్రమ్ ఫస్ట్ లుక్ రిలీజ్ కాబోతోంది.
క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా కావడం, పైగా యాక్షన్ మూవీ కావడంతో విక్రమ్‌పై అంచనాలు మామూలుగా లేవు. ఫస్ట్ లుక్‌కు సంబంధించి మంచి హైప్ కనిపిస్తోంది. మరి లోకేష్.. కమల్‌ను ఫస్ట్ లుక్‌లో ఎలా ప్రెజెంట్ చేశాడో చూడాలి. ఇందులో మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ విలన్ పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. అతనే సుకుమార్-అల్లు అర్జున్‌ల పుష్పలోనూ విలన్‌గా కనిపించనున్నాడు.
This post was last modified on July 10, 2021 10:11 am
ప్రభాస్ తన లైనప్ లో ఎన్ని క్రేజీ కాంబినేషన్స్ సెట్ చేసినా కూడా హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఫోకస్ మాత్రం…
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షం వైసీపీ లేని లోటును టీడీపీ ఎమ్మెల్యేలే తీర్చేస్తున్నారు. నిజానికి వైసీపీ ఉంటే కూడా ఇంతగా…
టాలీవుడ్లో అయినా.. మొత్తం ఇండియాలో అయినా… సోషల్ మీడియాలో అత్యధిక ట్రోలింగ్ ఎదుర్కొన్న మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే మరో…
మాములుగా ఎంత పెద్ద సినిమా అయినా సరే మూడో వారంలోకి వచ్చాక నెమ్మదించడం సహజం. కానీ అమరన్ మాత్రం ఈ…
తెలుగు సినిమా చరిత్రలోనే గొప్ప దర్శకుల్లో సుకుమార్ ఒకరు అనడంలో సందేహం లేదు. 20 ఏళ్ల కిందట్నుంచి సినిమాలు తీస్తున్న…
అత్తారింటికి దారేది సినిమాలో ఎంఎస్ నారాయణ చెప్పినట్టు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే విజేత. దీన్ని సరిగ్గా…