తమిళ, మలయాళ ఇండస్ట్రీలలో హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసిన సనమ్ శెట్టి తెలుగులో మహేష్ బాబు నటించిన ‘శ్రీమంతుడు’ సినిమాలో చిన్న పాత్రలో మెరిసింది. ఆ తరువాత ‘సింగం 123’, ‘ప్రేమికుడు’ లాంటి సినిమాల్లో నటించింది. అయితే కొన్ని నెలలుగా ఈమెని ఓ ఆకతాయి వేధిస్తున్నాడు. మొదట్లో ఈ వేధింపులను ఆమె పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఏకంగా ఆమెని, ఆమె కుటుంబాన్ని చంపేస్తానంటూ అతడు బెదిరిస్తుండడంతో సనమ్ శెట్టి పోలీసులను ఆశ్రయించింది. ఈ విషయాలను ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించింది ఈ భామ.
గత కొన్నాళ్లుగా ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ లలో దారుణమైన మెసేజ్ లు వస్తున్నాయని.. మొదట వాటిని పట్టించుకోలేదని.. కానీ ఇప్పుడు ఏకంగా తన ఫోన్ నెంబర్ కు బెదిరింపు మెసేజ్ లు పంపిస్తున్నారని తెలిపింది. ఆ వ్యక్తి తన వ్యక్తిగత విషయాలను కూడా సేకరించినట్లు అనిపించడంతో వెంటనే అప్రమత్తమై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పింది. ఎవరికైనా ఇలాంటి బెదిరింపులు ఎదురైతే లైట్ తీసుకోవద్దని.. బయటకు చెప్పి సాయం తీసుకోవాలని సూచించింది.
ఇలా చేయడం వలన వేరే వాళ్లకు కూడా సాయం చేసినట్లు అవుతుందని చెప్పుకొచ్చింది. సనమ్ శెట్టి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు అగంతకుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని రాయ్ జాన్ పాల్ గా గుర్తించారు. అయితే అతడు ఒక్కడే ఈ బెదిరింపులకు పాల్పడుతున్నాడా..? లేక దీని వెనుక ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తనను చంపేస్తానని బెదిరించిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న చెన్నై పోలీసులకు సనమ్ శెట్టి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పింది. అలానే ఇన్ని రోజులుగా తనకు ధైర్యం చెబుతూ తోడుగా ఉన్న వారందరికీ కృతజ్ఞతలు తెలిపింది.
This post was last modified on July 9, 2021 8:56 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…