Movie News

పూజా హెగ్డే రూటే వేరు


కెరీర్ ఆరంభంలో కొంచెం చిన్న స్థాయి, మీడియం రేంజ్ సినిమాలు చేసినప్పటికీ.. పెద్ద హీరోయిన్ అయ్యాక మాత్రం ప్రతి సినిమాకూ రేంజ్ ఉండేలా చూసుకుంటారు హీరోయిన్లు. ఒకసారి పెద్ద హీరోలతో జత కట్టడం మొదలయ్యాక మళ్లీ చిన్న, మీడియం రేంజ్ హీరోల వైపు చూడరు. కెరీర్ కొంచెం డౌన్ అయ్యాక కానీ మళ్లీ లీగ్ మార్చరు. కానీ కొందరు హీరోయిన్లు మాత్రం ఇందుకు మినహాయింపు. పూజా హెగ్డే ఆ కోవలోకే వస్తుంది.

‘డీజే’ సినిమాతో తెలుగులో మాంచి క్రేజ్ తెచ్చుకుని వరుసగా భారీ చిత్రాల్లో అవకాశాలు దక్కించుకుంది పూజా. వరుసగా ఆమె జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి బడా హీరోలతో జట్టు కడుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాలన్నీ ఒక రేంజ్ ఉన్నవే. ఐతే అవి చేస్తూనే అఖిల్ లాంటి చిన్న స్థాయి హీరోతో లో బడ్జెట్లో తెరకెక్కుతున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’లో కథానాయికగా నటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

ఈ సినిమా మొదలయ్యే సమయంతో పోలిస్తే ఆ తర్వాత పూజా రేంజ్ ఇంకా పెరిగింది. ‘అల వైకుంఠపురములో’ నాన్-బాహుబలి ఇండస్ట్రీ హిట్ కావడంతో ఆమెకు తెలుగులో డిమాండ్ ఇంకా పెరిగింది. హిందీలో సల్మాన్ ఖాన్, తమిళంలో విజయ్ లాంటి సూపర్ స్టార్లతో ఆమె సినిమాలు చేస్తుండటం విశేషం. ఇలాంటి టైంలో తెలుగులో తన రేంజ్‌తో పోలిస్తే చాలా తక్కువ అయిన నితిన్‌తో సినిమా చేయడానికి పూజా రెడీ అవుతుండటం విశేషం.

చెక్, రంగ్‌దె లాంటి ఫ్లాపులతో వెనుకబడిపోయిన నితిన్.. వక్కంతం వంశీ దర్శకత్వంలో సొంత నిర్మాణ సంస్థలో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో పూజా కథానాయికగా నటించనుందట. ముందు ఈ చిత్రానికి కథానాయికగా రష్మిక మందన్నా పేరు వినిపించింది. కానీ ఇప్పుడు ఆమె స్థానంలోకి పూజానే వచ్చిందట. ఆమెతో ఈ చిత్రానికి అగ్రిమెంట్ కూడా పూర్తయిందట. ఓవైపు భారీ చిత్రాల్లో నటిస్తూ ఇలాంటి మిడ్ రేంజ్ మూవీ సంతకం చేయడం ద్వారా తన రూటే వేరని పూజా చాటిచెబుతోంది.

This post was last modified on July 7, 2021 2:45 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

ప్రభాస్ ప్రభావం – కమల్ వెనుకడుగు

ప్యాన్ ఇండియా సినిమాల వాయిదా పర్వం కొనసాగుతూనే ఉంది. జూన్ 13 విడుదలను లాక్ చేసుకుని ఆ మేరకు తమిళనాడు…

6 hours ago

ట్రెండ్ సెట్టర్ రవిప్రకాష్.! మళ్ళీ మొదలైన హవా.!

సీనియర్ జర్నలిస్ట్ రవిప్రకాష్ గురించి తెలుగు నాట తెలియనివారెవరు.? మీడియాకి సంబంధించి ‘సీఈవో’ అన్న పదానికి పెర్‌ఫెక్ట్ నిర్వచనంగా రవిప్రకాష్…

6 hours ago

శ్యామల పొలిటికల్ కథలు.! ఛీటింగ్ సినిమా.!

బుల్లితెర యాంకర్, బిగ్ బాస్ రియాల్టీ షో ఫేం శ్యామల, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆంధ్ర ప్రదేశ్‌లో ఎన్నికల…

6 hours ago

బీఆర్ఎస్‌కూ కావాలొక వ్యూహ‌క‌ర్త‌

బీఆర్ఎస్ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఏదో అనుకుంటే ఇంకేదో అయింది. జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌నే క‌ల‌లు గ‌న్న…

10 hours ago

అద్దం పంపిస్తా.. ముఖం చూసుకో అన్న‌య్యా..

కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ష‌ర్మిల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కొన్నాళ్లుగా వైసీపీ అధినేత‌, సొంత అన్న‌పై ఆమె తీవ్ర‌స్థాయిలో యుద్ధం…

12 hours ago

ఎన్టీఆర్ పుట్టిన రోజుకు సర్ప్రైజ్

పెద్ద హీరోల పుట్టిన రోజులు, ఇంకేదైనా ప్రత్యేక సందర్భాలు వస్తే అభిమానులు వాళ్లు నటిస్తున్న కొత్త చిత్రాల నుంచి అప్‌డేట్స్…

12 hours ago