టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసిన లావణ్య త్రిపాఠికి ఈ మధ్యకాలంలో అవకాశాలు బాగా తగ్గాయి. ఈ ఏడాది ఆమె నటించిన ‘చావు కబురు చల్లగా’, ‘ఏ1 ఎక్స్ ప్రెస్’ లాంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. కానీ ఈ సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయాయి. ప్రస్తుతం లావణ్య చేతిలో ఒక్క ప్రాజెక్ట్ కూడా లేదు. అయినప్పటికీ కొన్ని బ్రాండ్స్ ను ప్రమోట్ చేస్తూ బాగానే డబ్బు సంపాదిస్తుంది.
ఇప్పటికే కొన్ని షాపింగ్ మాల్స్ కి సంబంధించిన యాడ్స్, అలానే హెర్బల్ హెయిర్ ఆయిల్ యాడ్ లో కనిపించిన ఈ బ్యూటీ ఇప్పుడు ఏకంగా సూపర్ స్టార్ యాడ్ కొట్టేసిందట. టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా.. బుల్లితెరపై పలు యాడ్స్ లో కనిపిస్తూనే ఉంటారు. చాలా ఉత్పత్తులకు ఆయన బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. అందులో ఒకటి గోల్డ్ విన్నర్ ఆయిల్ బ్రాండ్.
ఇప్పటికీ టీవీల్లో ఈ యాడ్ వస్తూనే ఉంటుంది. కానీ ఇప్పుడు మహేష్ కి బదులుగా ఆ యాడ్ కోసం లావణ్య త్రిపాఠిని ఎన్నుకున్నారట. ప్రస్తుతం దీనికి సంబంధించిన షూటింగ్ చెన్నైలో జరుగుతోంది. సూపర్ స్టార్ ప్రాతినిధ్యం వహించిన బ్రాండ్ ఇప్పుడు లావణ్య చేతుల్లోకి వచ్చిందంటే బ్రాండ్ సర్క్యూట్ లో ఆమెకి ఇది పెద్ద స్టెప్ అనే చెప్పాలి. మరి ఫ్యూచర్ లో ఇంకెన్ని బ్రాండ్స్ ను తన ఖాతాలో వేసుకుంటుందో చూడాలి!
This post was last modified on July 7, 2021 9:33 am
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…
బీఆర్ ఎస్ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు.. తన ఇంటిని తాకట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వద్దుకు…
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…