Movie News

జూనియ‌ర్ ఎన్టీఆర్ ప్రేమ‌క‌థ‌?

టాలీవుడ్ స్టార్ హీరోల్లో చాలా త‌క్కువ‌గా ప్రేమ‌క‌థ‌లు చేసిన హీరో ఎన్టీఆరే. కెరీర్ ఆరంభంలోనే వ‌య‌సుకు మించిన పాత్ర‌ల‌తో తిరుగులేని మాస్ ఇమేజ్ రావ‌డంతో తార‌క్ ప్రేమ‌క‌థల జోలికి పెద్ద‌గా వెళ్ల‌లేదు. అత‌డిపై మాస్ ముద్ర ప‌డిపోవ‌డంతో పూర్తి స్థాయి ప్రేమ‌క‌థ చేయ‌డానికి ఆస్కార‌మే లేకుండా పోయింది. ఇప్పుడు ప్రేమ‌క‌థ‌లు చేసే వ‌య‌సు కూడా దాటిపోవ‌డంతో ఇక మ‌ళ్లీ ఆ జాన‌ర్లో న‌టించే అవ‌కాశ‌మే ఉండ‌ద‌ని ఫిక్స‌యిపోయారంతా. కానీ త‌మిళ ద‌ర్శ‌కుడు అట్లీ తార‌క్‌ను ఓ ప్రేమ‌క‌థ‌లో చూపించ‌బోతున్నాడ‌న్న‌ది తాజా స‌మాచారం.

అట్లీతో తార‌క్ సినిమా గురించి ఎప్ప‌ట్నుంచో చ‌ర్చ జ‌రుగుతోంది. క‌లిసి సినిమా చేయ‌డానికి వీళ్లిద్ద‌రూ ఆస‌క్తిగానే ఉన్నారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మాణంలో ఈ కాంబినేష‌న్ సెట్ కావ‌చ్చ‌న్ని చాన్నాళ్లుగానే ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఐతే ఇద్ద‌రూ వేర్వేరు క‌మిట్మెంట్ల‌తో ఉండ‌టంతో సినిమా ఆల‌స్యం అవుతోంది. ఐతే తాజాగా ఈ కాంబోలో సినిమా దిశ‌గా క‌ద‌లిక వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. ఇటీవ‌లే అట్లీ తార‌క్‌కు ఓ క‌థ చెప్పాడ‌ట. అది అట్లీ తొలి సినిమా రాజా రాణి త‌ర‌హాలో ఎమోష‌న‌ల్ ల‌వ్ స్టోరీ అట‌. కొంచెం యాక్ష‌న్, క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ జోడించి ఈ సినిమాను తీర్చిదిద్దే ఆలోచ‌న‌లో ఉన్నాడ‌ట అట్లీ. స్టోరీ లైన్ తార‌క్‌కు బాగా న‌చ్చింద‌ని, బౌండ్ స్క్రిప్టుతో రావాల‌ని అట్లీకి చెప్పాడ‌ని స‌మాచారం.

ప్ర‌స్తుతం ఆర్ఆర్ఆర్‌లో న‌టిస్తున్న ఎన్టీఆర్.. త‌ర్వాత కొర‌టాల శివ‌, ప్ర‌శాంత్ నీల్ చిత్రాలు చేయాల్సి ఉంది. ఈలోపు అట్లీ.. షారుఖ్ ఖాన్ సినిమాను పూర్తి చేస్తాడు. ఆ తర్వాత వీరి క‌ల‌యిక‌లో సినిమా రావ‌డానికి ఛాన్సుంది. మ‌రి 40వ ప‌డికి చేరువ అవుతున్న ద‌శ‌లో త‌న‌కు పెద్ద‌గా ప‌ట్టులేని ల‌వ్ స్టోరీ జాన‌ర్లో తార‌క్ ఎలా మెప్పిస్తాడో.. అత‌ణ్ని అట్లీ ఎలా ప్రెజెంట్ చేస్తాడో చూడాలి.

This post was last modified on July 6, 2021 11:02 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

1 hour ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

3 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

3 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

3 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

4 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

4 hours ago