Movie News

మెహ్రీన్‌ నుంచి విడిపోవడంపై అతనేమన్నాడంటే..

కొన్నేళ్ల కిందట సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ త్రిష.. వరుణ్ మణియన్ అనే వ్యాపారవేత్తతో నిశ్చితార్థం చేసుకోవడం.. కొంత కాలం అతడితో కలిసున్నాక ఉన్నట్లుండి నిశ్చితార్థం చేసుకోవడం అప్పట్లో చర్చనీయాంశం అయింది. నిశ్చితార్థం రద్దయ్యాక త్రిష పేరెత్తకుండా ఆమెనుద్దేశించి నెగెటివ్ కామెంట్లు చేయడం గుర్తుండే ఉంటుంది.

ఇప్పుడు ఇదే తరహాలో సౌత్‌లో ఫేమస్ అయిన మరో హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా.. పొలిటీషియన్ అయిన భవ్య బిష్ణోయ్‌తో నిశ్చితార్థం చేసుకుని.. కొన్ని నెలలకే దాన్ని రద్దు చేసుకుంది. వీళ్ల మధ్య తీవ్ర విభేదాలే వచ్చాయని.. అందుకే విడిపోయారని అంటున్నారు. తాజాగా మెహ్రీన్ పెట్టిన ఒక పోస్టు భవ్యను ఉద్దేశించే అని భావిస్తున్నారు. ఆమె వ్యాఖ్యలు చూస్తే భవ్య, అతడి కుటుంబం ఆమెకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేదేమో అన్న సందేహాలు కలుగుతున్నాయి.

ఇదిలా ఉంటే.. మెహ్రీన్‌తో నిశ్చితార్థం రద్దవడంపై భవ్య కూడా స్పందించాడు. ఆమెను తానెంతో ప్రేమించానని.. కానీ తామిద్దరం కలిసి సాగలేకపోయామని అతనన్నాడు. మెహ్రీన్‌ నుంచి విడిపోవడం పట్ల తానేమీ చింతించట్లేదని అతను వ్యాఖ్యానించడం గమనార్హం.

“మా ఇద్దరి మధ్య అభిప్రాయభేదాల కారణంగా పరస్పర అంగీకారంతో నిశ్చితార్థాన్ని రద్దు చేసుకోవాలని జులై 1నే మేమిద్దరం నిర్ణయం తీసుకున్నాం. మెహ్రీన్‌ పరిచయమైన నాటి నుంచి ఆమెను ఎంతో ప్రేమించాను. ఆమె కుటుంబాన్ని కూడా గౌరవించాను. మా ఇద్దరిది మంచి జోడీ అవుతుందని భావించాను. కానీ కాలం మా జీవితాలను వేరు చేసింది. మెహ్రీన్‌ నుంచి విడిపోతున్నందుకు నేను బాధపడడం లేదు. నిశ్చితార్థం రద్దు విషయంలో నన్ను, నా కుటుంబాన్ని నిందిస్తూ ఎవరైనా వ్యాఖ్యలు చేస్తే.. వారిపై తగిన చర్యలు తీసుకుంటాను. మెహ్రీన్‌ ఎప్పుడూ సంతోషంగా ఉండాలని, ఆమె కలలన్నీ సాకారం కావాలని కోరుకుంటున్నాను” అని భవ్య పేర్కొన్నాడు. మెహ్రీన్‌తో పాటు ఆమె కుటుంబ సభ్యులను, స్నేహితులను తాను ఎప్పుడూ ఉన్నతంగానే చూశానని భవ్య అన్నాడు.

This post was last modified on July 5, 2021 3:49 pm

Share

Recent Posts

బ్యాక్ గ్రౌండ్ ఉన్నా ఫలితం దక్కలేదు

మొన్న గురువారం విడుదలైన సినిమాల్లో మారెమ్మ కూడా ఉంది. మాములుగా అయితే స్టార్ కాస్టింగ్ లేని ఇలాంటి మూవీని జనం…

4 minutes ago

పీడకలగా మారుతున్న పార్ట్ 2 ఫలితాలు

ఒక హిట్ మూవీకి కొనసాగింపు ఉండాలనుకోవడం మంచిదే. కథ డిమాండ్ చేసినప్పుడు, దానికి అనుగుణంగా దర్శకులు తమ క్రియేటివిటీని జోడించి,…

1 hour ago

స్థానిక ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు ముచ్చెమటలు

రాజస్థాన్ స్థానిక ఎన్నికల్లో అధికార బీజేపీతో ప్రతిపక్ష కాంగ్రెస్ ఢీ అంటే ఢీ అంటూ పోటీ పడింది. బీజేపీ కంచుకోటల్లో…

2 hours ago

కాకా ఎప్పుడు వస్తే బాగుంటుంది

2027 సంక్రాంతికి విశ్వంభర విడుదల దాదాపు ఖాయమేనని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ చిరంజీవి అంగీకారం…

2 hours ago

ఎప్పట్లాగే టీజర్ పేలింది… మరి సినిమా?

తమిళంలో రెండు దశాబ్దాల ముందే సూపర్ స్టార్ ఇమేజ్ సంపాదించిన హీరో విక్రమ్. సేతు, దిల్, ధూల్, జెమిని, పితామగన్,…

2 hours ago

నిన్న సందీప్ వంగ… నేడు శ్రీకాంత్ ఓదెల

మెగాస్టార్ చిరంజీవికి బయట జనంలోనే కాదు ఇండస్ట్రీలోనూ బోలెడు హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారనేది బహిరంగ రహస్యం. అది పలు…

7 hours ago