ఆర్.ఆర్.ఆర్. మీదే ప్రయోగం చేస్తున్నారు!

సినిమా షూటింగ్స్ కి పర్మిషన్ ఇవ్వడానికి ప్రభుత్వం సంశయిస్తోంది. వందల మంది కలిసి ఒకే చోట పని చేస్తారు కనుక కరోనా విజృంభిస్తున్న టైంలో అది రిస్క్ అని గవర్నమెంట్ భావిస్తోంది. అయితే ఫిజికల్ డిస్టెన్స్ పాటిస్తూ షూట్ చేసుకోవచ్చునని, అది చిన్న చితక సినిమాకి కాకుండా ఆర్.ఆర్.ఆర్. లాంటి భారీ సినిమాకే చేయవచ్చునని రాజమౌళి చెప్పారట. చాలా వరకు సన్నివేశాలకి తక్కువ మంది సిబ్బంది సరిపోతారని, అందుకోసం తాను టెస్ట్ షూట్ చేసి చూపిస్తానని రాజమౌళి అన్నారట. షూటింగ్ వ్యవహారం అంతా షూట్ చేసి చూపించాలని, తద్వారా అది సాధ్యమని ప్రభుత్వం కూడా అర్ధం చేసుకుంటుందని భావిస్తున్నారు.

జూన్ లోనే ఇదంతా చేస్తారని, జనం ఎక్కువ అవసరం అయ్యే సన్నివేశాలు డిసెంబర్ తర్వాత ప్లాన్ చేసుకుంటారని అంటున్నారు. ఆర్.ఆర్.ఆర్. లాంటి సినిమాకి తక్కువ సిబ్బంది సరిపోతారంటే ఇక మిగతా సినిమాలు అన్నిటికీ సిబ్బందిని తగ్గించేసి ప్రభుత్వ గైడ్ లైన్స్ కి అనుగుణంగా షూటింగ్ చేసేసుకుంటారు. ఇప్పుడు ఆ భారం రాజమౌళి భుజాలపై ఉందన్నమాట.