అర్జున్ రెడ్డిని అలా ఫిక్స్ చేసారా?

అర్జున్ రెడ్డి లాంటి ఒరిజినల్ లవ్ స్టోరీ తీసి ఇటు తెలుగు సినిమా పరిశ్రమలోనే కాకుండా, కబీర్ సింగ్ గా దానిని హిందీలో రీమేక్ చేసి అక్కడ కూడా తన సత్తా చాటుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకి ఇంత వరకు తదుపరి సినిమా సెట్ కాలేదు. మహేష్, ప్రభాస్ కోసం చేసిన ప్రయత్నాలు విఫలం కాగా, సందీప్ ఇప్పుడు తన కథకి తగ్గ హీరో కోసం చూస్తున్నాడు.

ఇదిలా వుంటే సందీప్ రెడ్డి వంగాకి సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ అడ్వాన్స్ ఇచ్చిందట. అతనితో సినిమా చేసే ప్లాన్ లో ఉందట. అతని కథకి హీరో ఇంకా సెట్ కాలేదు కాబట్టి, ఈలోగా తమ వద్ద ఉన్న ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ రీమేక్ చేయాలని ప్రపోసల్ పెట్టారట.

ఆ మలయాళ చిత్రాన్ని అంతే రాగా, అంతే ఇంటెన్స్ గా తీసే దర్శకుడు సందీప్ అని నిర్మాతలు బలంగా నమ్ముతున్నారట. అందుకే సందీప్ ని ఒప్పించడానికి ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నారని, మంచి పారితోషికం కూడా ఆఫర్ చేసారని టాక్ ఉంది. మరి సందీప్ ఈ రీమేక్ ప్రపోసల్ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా లేదా అనేది చూడాలి.