కరోనా కారణంగా చిత్ర పరిశ్రమ ఎక్కడిదక్కడ నిలిచిపోయినపుడు రోజు వారీ జీతాలపై ఆధారపడే వారికోసం సహాయనిధిని చిరంజీవి మొదలుపెడితే దాంతో చాలా మంది లాభపడ్డారు. అయితే చిరంజీవి పూనుకోవడం పట్ల ఇండస్ట్రీలో కొందరిలో ఆయన పెత్తనం ఏమిటనే అసంతృప్తి వ్యక్తం అయినట్టు రూమర్స్ వినిపించాయి.
ఇలాంటి విషయాల గురించి చిరంజీవి దృష్టికి వెళ్లే ఉంటుంది కానీ ఆయన తన పని తాను చేసుకుంటూ వెళ్లారు. ఇక లాక్ డౌన్ నెమ్మదిగా ఎత్తేస్తూ ఉన్న నేపథ్యంలో మళ్ళీ సినిమా పనులు మొదలు పెట్టాల్సిన సమయం ఆసన్నమవుతోంది. అయితే ఎదో షాప్ తెరిచిన మాదిరిగా కాకుండా ఇది వందల మంది ఒకే చోట కలిసి పని చేసే పరిశ్రమ కనుక కరోనా ఇంకా విజృంభిస్తున్న వేళ షూటింగ్స్ లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే థియేటర్లు తిరిగి తెరిచేలా ఎలాంటి చర్యలు చేపట్టాలి వంటి విషయాలపై చర్చించడానికి కూడా చిరంజీవి పూనుకోవలసి వచ్చింది.
దీనిపై కూడా భిన్న స్పందనలు వినిపిస్తున్నాయి కానీ ఎవరికి వారు సైలెంట్ గా ఉన్నప్పుడు ఎవరో ఒకరైతే ముందుకి వచ్చి ఆగిపోయిన మర ఆడడానికి స్విచ్ వేయాలిగా!
Gulte Telugu Telugu Political and Movie News Updates