బాలికా వధు సీరియల్‌లో బాల నటిగా దేశవ్యాప్తంగా తిరుగులేని పాపులారిటీ సంపాదించిన నటి అవికా గోర్. ఆ ఫేమ్‌తోనే టీనేజీలోనే తెలుగులో ఉయ్యాల జంపాలలో అవకాశం దక్కించుకుందామె. ఆ సినిమా సూపర్ హిట్టయి అవికాకు మరిన్ని అవకాశాలు తెచ్చిపెట్టింది.
కానీ సరైన సినిమాలు ఎంచుకోక అవికా కెరీర్ గాడి తప్పింది. మధ్యలో ఎక్కడికి పోతావు చిన్నవాడా మాత్రమే ఆడింది. దానికి ముందు, తర్వాత ఫ్లాపులు రావడంతో అవికా కెరీర్‌కు బ్రేకులు పడిపోయాయి.
ఒకసారి ఫేడవుట్ అయ్యాక మళ్లీ హీరోయిన్లు పుంజుకోవడం కష్టం. దీంతో అవికా కథ ముగిసినట్లే అనుకున్నారంతా. కానీ ఈ మధ్య బరువు తగ్గి నాజూగ్గా మారి తిరిగి టాలీవుడ్లోకి అడుగు పెట్టిన అవికా.. ఉన్నట్లుండి ఫుల్ బిజీ అయిపోవడం విశేషం. ఆమె చేతిలో అరడజనుకు పైగా సినిమాలుండటం గమనార్హం.
బుధవారం అవికా పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమె నటిస్తున్న కొత్త చిత్రాల మేకర్స్ తనకు శుభాకాంక్షలు చెబుతూ పోస్టర్లు, ప్రోమోలు వదిలారు. అవన్నీ చూసి అవికా సెకండ్ ఇన్నింగ్స్‌లో ఇంత బిజీ అయిపోయిందా అని అంతా ఆశ్చర్యపోతున్నారు. గీతా ఆర్ట్స్-2 బేనర్లో కళ్యాణ్ దేవ్ హీరోగా శ్రీధర్ సీపాన దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో అవికానే కథానాయిక కాగా.. అందులోంచి అవికా మీద ఒక గ్లింప్స్ వదిలారు.
మరోవైపు నాగచైతన్య చిత్రం థ్యాంక్యూలోనూ అవికా నటిస్తున్న సంగతి ఆ చిత్ర బృందం ఆమెకు శుభకాంక్షలు చెప్పడంతోనే వెల్లడైంది. మరోవైపు అవికా తన సొంత నిర్మాణ సంస్థలో పాప్ కార్న్ అనే సినిమా చేస్తోంది. అలాగే నవీన్ చంద్ర హీరోగా కార్తీక్ తుపుర్నేని అనే దర్శకుడు రూపొందిస్తున్న సినిమాలోనూ అవికా నటిస్తోంది.
ఇక హేమంత్ అనే దర్శకుడితో కొత్త నిర్మాతలు తెరకెక్కిస్తున్న చిత్రంలోనూ అవికా హీరోయిన్. ఆది సరసన అమరన్ అనే సినిమా.. రవితేజ మన్యం అనే మరో దర్శకుడి చిత్రం.. ఇవి కాక జీ5 వాళ్లు తీస్తున్న నెట్ అనే వెబ్ సిరీస్.. ఇలా అవికా లిస్టు చాలా పెద్దగానే ఉంది. చూస్తుంటే బరువు తగ్గించుకుని సెక్సీగా తయారయ్యాక అవికా కెరీర్ దశ తిరిగినట్లే కనిపిస్తోంది.
This post was last modified on July 1, 2021 10:40 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…