చాలా ఏళ్లుగా సరైన హిట్టు కోసం ఎదురుచూస్తున్నాడు కళ్యాణ్ రామ్. కానీ ఆయన నటిస్తోన్న సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. ఎన్నో ఆశల పెట్టుకొని నటించిన ‘118’, ‘ఎంతమంచి వాడవురా’ వంటి సినిమాలు కూడా కళ్యాణ్ రామ్ కి నిరాశనే మిగిల్చాయి. దీంతో తన తదుపరి సినిమాల విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు.
ఏదైనా కొత్త ఎలిమెంట్ ఉంటే తప్ప సినిమాలు ఒప్పుకోవడం లేదు.ఈ క్రమంలో ఆయన వద్దకు వస్తోన్న పీరియాడిక్ సినిమాలపై ఆయన ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ‘బింబిసార’ అనే పీరియాడిక్ సినిమాలో నటిస్తున్నాడు కళ్యాణ్ రామ్. మల్లిడి వేణు డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. దీన్ని రెండు భాగాలుగా చిత్రీకరిస్తారని అంటున్నారు. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన చిన్న వీడియోను విడుదల చేశారు. భారీ బడ్జెట్ తో వీఎఫ్ఎక్స్ ప్రధానంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
ఈ సినిమాతో పాటు కళ్యాణ్ రామ్ మరో పీరియాడిక్ సినిమా చేయబోతున్నట్లు సమాచారం. 1950 బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఒక కథను ఇటీవల నిర్మాత అభిషేక్ నామా ఓకే చేసినట్లు తెలుస్తోంది. నవీన్ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాను రూపొందించబోతున్నాడు. ఇందులో కళ్యాణ్ రామ్ ను హీరోగా అనుకుంటున్నారు. ఈ ఏడాది ఆఖరులో సినిమాను ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. ఈలోగా కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ షూటింగ్ ను పూర్తి చేస్తాడు.
This post was last modified on June 30, 2021 7:50 pm
ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…
కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…
ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…
దసరా తర్వాత నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వచ్చిన ది ప్యారడైజ్ సినిమా మిశ్రమ స్పందన…
హెడ్డింగ్ చూడగానే ఏంటీ పొగడ్తనే అనుమానం రావొచ్చు కానీ అసలు విషయం తెలుసుకున్నాక నిజమే అనుకోక మానరు. విషయం ఏమిటంటే…
గత ఎన్నికల్లో ఓటమి పాలైన డీఎంకే అధినేత స్థాలిన్ దాన్నుంచి ఎలాంటి గుణపాఠం నేర్చుకున్నట్లు లేదు. ఆయన, ఆయన కుమారుడు…