మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల వ్యవహారం కొన్ని రోజులుగా ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. ఎన్నికలకు ఇంకా మూడు నెలలు సమయం ఉండగానే.. ఈ లోపే వేడి రాజుకుంది. ప్రకాష్ రాజ్‌తో పాటు మంచు విష్ణు, జీవిత, సీవీఎల్ నరసింహారావు, ఒ.కళ్యాణ్ అధ్యక్ష ఎన్నికల బరిలో నిలుస్తున్న సంగతి తెలిసిందే.
ప్రకాష్ రాజ్, విష్ణు, సీవీఎల్ ఇప్పటికే తమ అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. మిగతా వాళ్ల నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అధ్యక్ష పదవికి పోటీ పడటంపై ఆలోచిస్తున్నానని.. ఇంకా ఓ నిర్ణయం తీసుకోలేదని జీవిత అన్నారు. ఆమె పోటీ చేయడం దాదాపు ఖాయం అంటున్నారు. ఇదిలా ఉండగా ఇండస్ట్రీ పెద్దల్లో ఎవరు ఎవరికి మద్దతు ఇస్తారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మెగాస్టార్ చిరంజీవి.. ప్రకాష్ రాజ్‌ను సపోర్ట్ చేయనున్నట్లు చెబుతున్నారు. చిరు సోదరుడు నాగబాబు ఈ విషయంపై పరోక్ష సంకేతాలు ఇచ్చారు.
చిరు తర్వాత అందరూ మద్దతు పరంగా ఆలోచించేది నందమూరి బాలకృష్ణ గురించే. ఆయన ఎవరిని సపోర్ట్ చేస్తారన్నది ఉత్కంఠభరితంగా మారింది. చిరు.. ప్రకాష్ రాజ్‌ను సపోర్ట్ చేసిన నేపథ్యంలో బాలయ్య మంచు విష్ణు లేదా జీవితకు మద్దతు ఇవ్వొచ్చని భావిస్తున్నారు. ఐతే ఆయన జీవిత వైపే ఉన్నట్లుగా వార్తలొస్తున్నాయి.
గత ఏడాది ‘మా’కు సంబంధించిన ఓ సన్నివేశంలో రాజశేఖర్‌పై చిరు ఆగ్రహం వ్యక్తం చేయడం, అప్పట్నుంచి ఆయన ‘మా’ కార్యకలాపాలకు దూరంగా ఉండటం తెలిసిందే. రాజశేఖర్‌కు చిరుతో ముందు నుంచి అభిప్రాయ భేదాలున్నాయి. ఈ నేపథ్యంలో చిరును వ్యతిరేకించే జీవిత, రాజశేఖర్‌ల వైపు బాలయ్య నిలవబోతున్నాడని.. జీవితకు ఆయన బహిరంగ మద్దతు ప్రకటించే అవకాశముందని అంటున్నారు. ‘మా’లో తాము చేపట్టిన కొన్ని కార్యక్రమాలు కూడా తమకు కలిసొస్తాయని, బాలయ్య మద్దతు కూడా లభిస్తే ఎన్నికల్లో గెలవడానికి మంచి అవకాశాలుంటాయని జీవిత యోచిస్తున్నట్లు సమాచారం.
This post was last modified on June 30, 2021 2:48 pm
ప్రభాస్ తన లైనప్ లో ఎన్ని క్రేజీ కాంబినేషన్స్ సెట్ చేసినా కూడా హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఫోకస్ మాత్రం…
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షం వైసీపీ లేని లోటును టీడీపీ ఎమ్మెల్యేలే తీర్చేస్తున్నారు. నిజానికి వైసీపీ ఉంటే కూడా ఇంతగా…
టాలీవుడ్లో అయినా.. మొత్తం ఇండియాలో అయినా… సోషల్ మీడియాలో అత్యధిక ట్రోలింగ్ ఎదుర్కొన్న మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే మరో…
మాములుగా ఎంత పెద్ద సినిమా అయినా సరే మూడో వారంలోకి వచ్చాక నెమ్మదించడం సహజం. కానీ అమరన్ మాత్రం ఈ…
తెలుగు సినిమా చరిత్రలోనే గొప్ప దర్శకుల్లో సుకుమార్ ఒకరు అనడంలో సందేహం లేదు. 20 ఏళ్ల కిందట్నుంచి సినిమాలు తీస్తున్న…
అత్తారింటికి దారేది సినిమాలో ఎంఎస్ నారాయణ చెప్పినట్టు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే విజేత. దీన్ని సరిగ్గా…