ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్డే అన్నట్లుగా చూస్తుంది మిగతా ప్రపంచం. దేశంలో అత్యధిక రాష్ట్రాల్లో జనాలు మాట్లాడే హిందీ భాషలో సినిమాలు తీస్తూ పెద్ద మార్కెట్‌ను కలిగి ఉన్న బాలీవుడ్ ముందు ప్రాంతీయ భాషల్లో సినిమాలు తీసి ఒక్కో రాష్ట్రానికి పరిమితం అయిన టాలీవుడ్, కోలీవుడ్ లాంటి ఇండస్ట్రీలు కొంచెం చిన్నవిగానే కనిపించేవి ఇంతకుముందు. కానీ సౌత్ ప్రేక్షకులకు సినిమా అభిమానం ముందు హిందీ వాళ్ల సినీ ప్రేమ చిన్నదే.
ముఖ్యంగా తెలుగు, తమిళ అభిమానుల సినిమా పిచ్చి గురించి ఎంత చెప్పినా తక్కువే. తమకు మంచి వినోదాన్నందించే సినిమాలు తీస్తే వాటిని ఎలా నెత్తిన పెట్టుకుంటారో, ఏ స్థాయి విజయాన్నందిస్తారో చెప్పడానికి ఎన్నో రుజువులున్నాయి. కాగా మన సినిమాల ప్రమాణాలు కూడా గత కొన్నేళ్లలో ఎంతగానో పెరిగి.. బాలీవుడ్ కూడా టాలీవుడ్ ముందు వెలవెలబోయే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ‘బాహుబలి’ తర్వాత టాలీవుడ్ రేంజే మారిపోయింది.
ప్రస్తుతం తెలుగుతో పాటు సౌత్ సినిమాలకు వస్తున్న బిజినెస్ ఆఫర్లు, వాటి డీల్స్ చూస్తే కళ్లు తిరగడం ఖాయం. వాటి ముందు దేశవ్యాప్తంగా మార్కెట్ ఉన్న బాలీవుడ్ సినిమాలు వెలవెలబోతున్నాయి. ‘బాహుబలి’ తర్వాత రాజమౌళి తీస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సంగతే తీసుకుంటే.. కేవలం డిజిటల్, శాటిలైట్ రైట్స్ ద్వారా మాత్రమే రూ.350 కోట్ల దాకా ఆదాయం తెచ్చుకుందీ చిత్రం. ఇక థియేట్రికల్ రైట్స్ కూడా కలిపితే బిజినెస్ లెక్క రూ.800 కోట్లను దాటేలా ఉంది.
ఇక ప్రభాస్ సినిమా ‘రాధేశ్యామ్’ డిజిటల్, శాటిలైట్ రైట్స్ రూ.200 కోట్లకు పైగానే పలికినట్లు తెలుస్తోంది. ఈ సినిమా మొత్తం బిజినెస్ రూ.500 కోట్ల మార్కును టచ్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఇక కన్నడ ప్రధానంగా తెరకెక్కుతున్న ‘కేజీఎఫ్-2’కు కూడా ఇదే స్థాయిలో బిజినెస్ జరుగుతున్నట్లు సమాచారం. ఈ చిత్రాల ముందు బాలీవుడ్ సినిమాలు అస్సలు నిలిచే పరిస్థితి లేదు. అక్కడి సూపర్ స్టార్ల సినిమాలకు కూడా సౌత్ సినిమాలతో పోలిస్తే సగం బిజినెస్ జరగడం కష్టంగా ఉంది. మున్ముందు టాలీవుడ్, ఇతర సౌత్ ఇండస్ట్రీల నుంచి మరిన్ని భారీ చిత్రాలు రాబోతున్న నేపథ్యంలో బాలీవుడ్ వాటి ముందు నిలిచే పరిస్థితే కనిపించడం లేదు.
This post was last modified on %s = human-readable time difference 10:57 am
బహుశా నిఖిల్ కెరీర్ లోనే తక్కువ సౌండ్ తో వస్తున్న సినిమా అప్పుడో ఇప్పుడో ఎప్పుడో. నవంబర్ 8 విడుదలలో…
ప్రపంచంలో ప్రముఖ మెసేజింగ్ ప్లాట్ఫారమ్గా ఉన్న వాట్సాప్ అనుచిత ఖాతాలపై కఠిన చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో, సెప్టెంబర్ నెలలో…
గత వైసీపీ హయాంలో జగన్ సాగించిన పాలన ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుకు విషమ పరీక్షలు పెడుతోందనే భావన కూటమి…
ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే 120 రోజులపాటు విజయవంతమైన…
ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే మొదటి ప్యాన్ ఇండియా మూవీ హరిహర వీరమల్లు పార్ట్ 1…
ఒక చిన్న పల్లెటూరు. దాని వెనుకో రహస్యాన్ని దాచుకున్న క్రైమ్. అది ఛేదించడానికి హీరో రంగంలోకి దిగుతాడు. ఊహించని ట్విస్టులతో…