అక్షయ్ కుమార్ తో రకుల్ రొమాన్స్!

రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండేది. కానీ ఇప్పుడు బాలీవుడ్ సినిమాలతో బిజీ అయింది. అజయ్ దేవగన్ తో రెండు సినిమాలు చేస్తోన్న రకుల్ తాజాగా మరో సినిమాలో నటించడానికి ఒప్పుకున్నట్లు సమాచారం. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటిస్తోన్న కొత్త సినిమాలో రకుల్ ని హీరోయిన్ గా తీసుకోవాలనుకుంటున్నారు. నిజానికి ముందుగా కియారా అద్వానీ లేదా శ్రద్ధా కపూర్ ని తీసుకోవాలనుకున్నారు. కానీ ఫైనల్ గా ఆ ఛాన్స్ రకుల్ కి వెళ్లిందని తెలుస్తోంది.

అజయ్ దేవగన్ తో రకుల్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ వర్కవుట్ అవ్వడంతో అక్షయ్ పక్కన కూడా ఆమె సూట్ అవుతుందని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. ‘బెల్ బాటమ్’ దర్శకుడు రంజిత్ తివారి తెరకెక్కించనున్న ఈ సినిమాను నలభై రోజుల్లో పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. పక్కా ప్లానింగ్ తో ముందుకు వెళ్తున్నారు. రకుల్ కూడా వారు అడిగిన కాల్షీట్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉందట. ఇదే గనుక నిజమైతే బాలీవుడ్ లో రకుల్ కి డిమాండ్ పెరగడం ఖాయం.

కానీ వరుసగా సీనియర్ హీరోలతో సినిమాలు చేస్తోన్న ఈ బ్యూటీకి యంగ్ హీరోలు అవకాశాలు ఇస్తారో లేదో చూడాలి. ఇక తెలుగులో క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా పూర్తి చేసింది రకుల్. వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమాలో వీఎఫ్ఎక్స్ వర్క్ ఇంకా పెండింగ్ లో ఉంది. ఆ కారణంగానే సినిమా రిలీజ్ ఆలస్యమవుతుంది.