దక్షిణాది స్టార్ హీరోయిన్ నయనతార చాలా కాలంగా దర్శకుడు విఘ్నేష్ శివన్ తో ప్రేమలో ఉంది. నాలుగేళ్లుగా రిలేషన్ లో ఉన్న ఈ జంట పలు విషయాలతో వార్తల్లో నిలుస్తుంటారు. ఈ మధ్యకాలంలో వీరి పెళ్లి విషయం కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ ఏడాది చివర్లో నయన్-విఘ్నేష్ ల పెళ్లి ఉంటుందని ప్రచారం సాగింది. అయితే విఘ్నేష్ మాత్రం ఆ వార్తలను ఖండించాడు. ప్రస్తుతం తామిద్దరం చాలా బిజీగా ఉన్నామని.. కెరీర్ పరంగా సాధించాల్సింది చాలా ఉందని అన్నారు.
అంతేకాదు.. డేటింగ్ లైఫ్ మీద బోర్ కొట్టినప్పుడు మాత్రమే పెళ్లి గురించి ఆలోచిస్తామని కామెంట్ చేశారు. అయితే ఇప్పుడు వీరి పెళ్లి విషయం ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ జంట పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు సమాచారం. ఈ విషయంపై విఘ్నేష్ శివన్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తాజాగా నెటిజన్లతో ముచ్చటించిన ఆయన వాళ్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
ఈ క్రమంలో ఓ నెటిజన్.. ”మీరు.. నయన్ ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోవడం లేదు. మీ పెళ్లి కోసం చాలా ఎదురుచూస్తున్నాం” అని అడగ్గా.. దానికి విఘ్నేష్ ఇచ్చిన రిప్లై వైరల్ అవుతోంది. పెళ్లి అనేది చాలా ఖర్చుతో కూడుకున్నదని.. ఆ శుభకార్యానికి కావాల్సిన డబ్బు ఆదా చేస్తున్నానని చెప్పుకొచ్చారు విఘ్నేష్. అంతేకాకుండా.. కరోనా వెళ్లిపోవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. దీంతో పరోక్షంగా తామిద్దరం పెళ్లికి సిద్ధంగానే ఉన్నామని చెప్పకనే చెప్పారు విఘ్నేష్ శివన్. అన్నీ వర్కవుట్ అయితే గనుక ఈ ఏడాది చివర్లో కానీ వచ్చే ఏడాది ఆరంభంలో కానీ వీరి వివాహం జరగొచ్చు.
This post was last modified on June 28, 2021 5:53 pm
ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్రస్థాయిలో జనసేన నాయకులకు అర్ధమైంది ఏంటి? అనేది…
వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…
వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ పెట్టనున్నట్టు రాజ్యసభ మాజీ సభ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖపట్నంలో మాట్లాడిన ఆయన..…
తల్లిదండ్రులపై ప్రేమ ఉండాల్సిందే. కానీ, అది వారు జీవించినంత వరకు ఉండాల్సిందే. కానీ, జ్యాతస్యహి ధ్రువో మృత్యు.. అన్నట్టుగా కాలం…
భూమికి 33 వేల అడుగుల ఎత్తులో... ఆకాశంలో యుద్ధం జరిగింది. సినిమాను తలపించిన ఈ యుద్ధంలో హీరో ఇండియన్ కెప్టెన్…