గత ఏడాది కరోనా టైంలో చాలామంది సినీ ప్రముఖులు కాలం చేశారు. అందులో సినీ ప్రేక్షకులను చాలా బాధ పెట్టిన మరణాల్లో ఇర్ఫాన్ ఖాన్‌ది ఒకటి. ఐతే ఆయన మరణించింది కరోనాతో కాదు. ఒక అరుదైన క్యాన్సర్ బారిన పడి కొన్నేళ్ల పాటు పోరాడిన ఇర్ఫాన్.. గత ఏడాది కన్నుమూశాడు. ఇర్ఫాన్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు.
లైఫ్ ఆఫ్ పై, జురాసిక్ వరల్డ్ లాంటి హాలీవుడ్ చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలందుకున్నాడతను. చాలామంది సినీ ప్రముఖుల్లాగే ఆయన కూడా తన కొడుకు బబిల్ ఖాన్‌ను నటనలోకి తేవాలనుకున్నాడు. టీనేజీలో ఉండగానే ఫిల్మ్ కోర్సులు చేయడానికి అతణ్ని విదేశాలకు కూడా పంపించాడు. ఐతే అప్పుడే ఇర్ఫాన్ అనారోగ్యం పాలయ్యాడు. తండ్రి అనారోగ్యం తాలూకు బాధను తట్టుకుంటూనే బబిల్ కోర్సులు పూర్తి చేశాడు.
గత ఏడాది తండ్రి చనిపోయిన టైంలో అతను స్వదేశానికి వచ్చి కొన్ని నెలలు తల్లి దగ్గర ఉన్నాడు. తిరిగి ఫారిన్‌కు వెళ్లిపోయాడు. ఇప్పుడు కోర్సు పూర్తి చేసుకుని ముంబయికి వచ్చేసిన అతడికి ఒక మంచి ప్రాజెక్టు స్వాగతం పలకడం విశేషం. నెట్‌ఫ్లిక్స్ నిర్మించబోయే ‘ఖాలా’ అనే చిత్రంలో బబిల్ ఖాన్ ముఖ్య పాత్ర పోషించనున్నాడు. అతడికి జోడీగా ‘బుల్ బుల్’ ఫేమ్ తృప్తి దిమ్రి నటించనుంది. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకడైన సూర్జిత్ సిర్కార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు.
విక్కీ డోనర్, పీకూ, అక్టోబర్ లాంటి చిత్రాలతో సత్తా చాటిన సూర్జిత్‌కు ఇర్ఫాన్‌తో మంచి అనుబంధమే ఉంది. వీళ్లిద్దరూ కలిసి ‘పీకూ’కు పని చేశారు. ఇప్పుడు ఇర్ఫాన్ కొడుకును అతనే నటుడిగా పరిచయం చేస్తున్నాడు. లుక్స్ పరంగా బబిల్ యావరేజ్‌గా అనిపిస్తున్నప్పటికీ.. నటనలో తండ్రికి తగ్గ వారసుడు అనిపించుకుంటాడేమో చూడాలి.
This post was last modified on June 28, 2021 3:10 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…