మాస్ రాజా కెరీర్లో బ్యాడ్ ఫేజ్ కొనసాగుతూనే ఉంది. అతను చివరగా ‘రాజా ది గ్రేట్’తో హిట్టు కొట్టాడు. ఆ తర్వాత ఏ సినిమా ఆడలేదు. దానికి ముందు కూడా వరుసగా ఫ్లాపులు ఎదుర్కొన్నాడు. గత మూడేళ్లలో ‘టచ్ చేసి చూడు’, ‘నేల టికెట్టు’, ‘అమర్ అక్బర్ ఆంటోనీ’, ‘డిస్కో రాజా’ లాంటి పెద్ద డిజాస్టర్లు ఖాతాలో వేసుకున్నాడు.
చివరగా వచ్చిన ‘డిస్కో రాజా’ అయితే మరీ దారుణమైన ఫలితాన్నందుకుంది. ప్రస్తుతం అతడి ఆశలన్నీ ‘క్రాక్’ మీదే ఉన్నాయి. ఆ సినిమాపై అయితే మంచి అంచనాలే ఉన్నాయి. ప్రయోగాలతో చేతులు కాల్చుకున్న నేపథ్యంలో తనకు బాగా అలవాటైన మాస్ సినిమాలే చేయడానికి పూనుకున్నాడు రవితేజ.
ఇందులో భాగంగానే రమేష్ వర్మతో ఓ మసాలా సినిమా చేయడానికి రెడీ అయ్యాడు మాస్ రాజా. రమేష్‌తో ‘రాక్షసుడు’ తీసిన కోనేరు సత్యనారాయణనే ఈ చిత్రాన్ని కూడా ప్రొడ్యూస్ చేయాల్సి ఉంది. కరోనా ప్రభావం మొదలవడానికి ముందు ఈ సినిమాకు అంగీకారం కుదిరింది. ఐతే లాక్ డౌన్ తర్వాత ఇప్పుడు పరిస్థితులు మారిపోవడంతో ఈ సినిమాపై నీలి నీడలు కమ్ముకున్నట్లు సమాచారం.
బడ్జెట్ సమస్యలతో ఈ సినిమాను ప్రస్తుతానికి హోల్డ్‌లో పెట్టినట్లుగా చెబుతున్నారు. స్క్రిప్టు మీద కూడా అంత భరోసా లేకపోవడం, రవితేజ మార్కెట్ కూడా బాగా దెబ్బ తిని ఉండటం, బడ్జెట్ విషయంలో తర్జన భర్జనలు నడుస్తుండటంతో ఈ సినిమాను ఆపేయడమే మంచిదన్న నిర్ణయానికి వచ్చారట. ఐతే తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదు. లాక్ డౌన్ తర్వాత ఏ సంగతీ తేలే అవకాశముంది.
This post was last modified on May 21, 2020 8:26 am
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…