జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు కానుకగా.. ‘ఆర్ఆర్ఆర్’ టీం నుంచి కచ్చితంగా ఏదో ఒక విశేషం ఉంటుందని ఎంతగానో ఆశించారు అభిమానులు. కానీ లాక్ డౌన్ కారణంగా జక్కన్న అండ్ టీం ప్రణాళికలు ఫలించలేదు. అరకొరగా ఏదో ఒకటి చేసి అసంతృప్తికి గురి చేయడం కన్నా.. అన్నీ సవ్యంగా ఉన్నపుడు పర్ఫెక్ట్‌గా టీజర్ తయారు చేసి రిలీజ్ చేయడమే మంచిదని చిత్ర బృందం భావించింది.
అందుకే అతడి పుట్టిన రోజున ఏ విశేషం ఉండబోదని తేల్చేసింది. ఐతే తారక్ పుట్టిన రోజు వెళ్లిపోయినా.. పరిస్థితులు అనుకూలిస్తే సాధ్యమైనంత త్వరగా అతడి పాత్రకు సంబంధించిన టీజర్ రలీజ్ చేయాలని అనుకుంటున్నారు.
మరి కొన్ని వారాల్లోనే షూటింగులకు ప్రభుత్వాల నుంచి అనుమతులు వస్తాయని భావిస్తున్నారు. ఎలాగూ సినిమాను వచ్చే సంక్రాంతి నుంచి వాయిదా వేస్తున్న నేపథ్యంలో రిలీజ్ గురించి టెన్షన్ పడాల్సిన పని లేదు. రెగ్యులర్ షూటింగ్ సంగతి అలా ఉంచితే ముందు తారక్ టీజర్‌కు సంబంధించిన కంటెంట్ రెడీ చేయాలని జక్కన్న భావిస్తున్నాడట. చిత్రీకరణపై ఆంక్షలు కొన్ని రోజుల వ్యవధిలోనే ఆ పని పూర్తి చేయాలని భావిస్తున్నారు.
మరి టీజర్ రిలీజ్ చేయడానికి తగ్గ సందర్భం ఏముంటుందా అని చూస్తే ఆగస్టు 15 లోపు ఏ అకేషన్ లేదు. ఐతే సందర్భం చూడకుండా కంటెంట్ రెడీ అవ్వగానే సాధ్యమైనంత త్వరగా దాన్ని రిలీజ్ చేసేయాలని చిత్ర బృందం డిసైడైపోయిందట. తారక్ అభిమానుల్ని ఎక్కువ రోజులు వెయిట్ చేయించకూడదన్న ఉద్దేశంతో ఇలా నిర్ణయించారట. కాబట్టి షూటింగ్స్ పున:ప్రారంభం అయ్యాక కొన్ని వారాల్లోనే తారక్ టీజర్ రిలీజయ్యేందుకు అవకాశముంది.
This post was last modified on May 21, 2020 8:27 am
ఈమధ్య AI టెక్నాలజీతో హాట్ టాపిక్ గా నిలిచిన చైనా టారిఫ్ వార్ తో కూడా అమెరికాతో పోటీ పడడం…
తెలుగులో ఒకప్పుడు వెలుగు వెలిగిన నిర్మాతలు చాలామంది కనుమరుగైపోయారు. కానీ అల్లు అరవింద్, సురేష్ బాబు లాంటి కొద్ది మంది…
అగ్రరాజ్యం అమెరికా కొత్తగా సుంకాల పెంపు కారణంగా ఏపీలో ఆక్వా రంగంపై తీవ్ర ప్రభావం పడినా... కూటమి సర్కారు తీసుకున్న…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ తో కలిసి…
ఒకప్పుడు తమిళ డబ్బింగ్ సినిమాలను చూసి తెలుగులో ఇలాంటి సినిమాలు రావేంటి అని చాలా ఫీలయ్యేవాళ్లు మన ప్రేక్షకులు. అక్కడ ఎన్నో కొత్త…
మాస్ రాజా రవితేజకు గత కొన్నేళ్లలో పెద్ద హిట్ అంటే.. ధమాకానే. ఈ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకుని కూడా బ్లాక్ బస్టర్…