అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో ‘పుష్ప’ అనే పాన్ ఇండియా సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాను రెండు భాగాలుగా రూపొందించాలని నిర్ణయించుకున్నారు. షూటింగ్ సమయంలో ఫుటేజ్ ఎక్కువ వస్తుండడంతో రెండు భాగాలుగా సినిమా తీస్తే.. కథను మరింత బాగా చెప్పొచ్చని ఈ నిర్ణయం తీసుకున్నారు. హీరో బన్నీ కూడా దీనికి ఒప్పుకున్నారు.
కరోనా కారణంగా ఆగిన సినిమా షూటింగ్ ను మరికొద్ది రోజుల్లో పునః ప్రారంభించనున్నారు. అయితే ఫస్ట్ పార్ట్ షూటింగ్ పూర్తయిన తరువాత కొంత గ్యాప్ తీసుకొని ‘ఐకాన్’ లేదా మరో సినిమాను పూర్తి చేయాలనేది బన్నీ ప్లాన్. ‘ఐకాన్’ సినిమా బౌండెడ్ స్క్రిప్ట్ కూడా సిద్ధంగా ఉంది. నాలుగైదు నెలల్లో షూటింగ్ పూర్తి చేయాలని అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం.. దర్శకుడు సుకుమార్ ‘పుష్ప’ సినిమా రెండు భాగాలను బ్యాక్ టు బ్యాక్ విడుదల చేయాలనుకుంటున్నారట.
అలా అయితేనే బాగుంటుందని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని బన్నీకి చెప్పారట. కానీ ఆయన మాత్రం ఫస్ట్ పార్ట్ పూర్తయిన తరువాత గ్యాప్ తీసుకొని ‘ఐకాన్’ పూర్తి చేస్తానని చెబుతున్నారట. కానీ సుకుమార్ మాత్రం కంటిన్యూస్ గా షూటింగ్ చేస్తేనే ఒక ఫ్లో ఉంటుందని అంటున్నారు. లేకపోతే ఆసక్తి తగ్గి, షూటింగ్ ఆలస్యమయ్యే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. దీంతో బన్నీను ఒప్పించే పనిలో పడ్డారు. మరి డైరెక్టర్-హీరో ఒకే మాట మీదకు వస్తారో లేదో చూడాలి!
This post was last modified on June 27, 2021 3:09 pm
పెద్ది తర్వాత మూడు నెలలకు పైగా రెస్ట్ మోడ్ లో ఉన్న రామ్ చరణ్ త్వరలో ఆర్సి 17 కోసం…
అక్టోబర్ 9 నుంచి తప్పుకున్నాక ఆదర్శ కుటుంబం ఏకె 47 కొత్త విడుదల తేదీ కోసం దగ్గుబాటి అభిమానులు కళ్ళు…
ఒక కొత్త సినిమా ప్రోమో రాగానే దాన్ని గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమాలతో పోల్చడం ఆడియన్స్ కు అలవాటే.…
తల్లిదండ్రులు పిల్లల్ని పొగిడితే ఆయుక్షీణం అంటారు. పవన్ కళ్యాణ్‌కు చిరంజీవి పేరుకు అన్నయ్యే కానీ.. ఆయనది తండ్రి స్థానమే. అందుకేనేమో…
నిర్మాతలు అదిగో ఇదిగో అనడమే తప్పించి ఫలానా డేటుకి రామాయణ పార్ట్ 1 రిలీజ్ అవుతుందని ఇప్పటికీ చెప్పకపోవడం మహా…
తమిళ నటుడు సూర్య పెద్ద స్టార్ హీరో అయినా.. ఏమాత్రం భేషజం లేని, ఉన్నత వ్యక్తిత్వం తనది. అభిమానులను అక్కున…