జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఈ మధ్య ట్విట్టర్లో యమ యాక్టివ్ అవుతున్నారు. వేరే హీరోల అభిమానులు ట్విట్టర్లో రికార్డుల మీద రికార్డులు కొడుతుండటంతో తారక్ ఫ్యాన్స్ కూడా ఈ విషయంలో పంతం పట్టారు. మే 20న తారక్ పుట్టిన రోజును పురస్కరించుకుని మూడు వారాల కిందటే వారి హంగామా మొదలైంది. తారక్ బర్త్ డే కామన్ డీపీని రిలీజ్ చేసిన సందర్భంగా దాన్ని ట్రెండ్ చేస్తూ ఏకంగా 8.5 మిలియన్ ట్వీట్లు వేశారు. అప్పుడే అంత హడావుడి చేసిన వాళ్లు.. ఇక పుట్టిన రోజు నాడు ఇంకెంత ప్రతాపం చూపిస్తారో అనుకున్నారంతా. ఆ అంచనాలకు తగ్గట్లే వాళ్లు రెచ్చిపోయారు.
ఎన్టీఆర్ బర్త్ డే హ్యాష్ ట్యాగ్ మీద 24 గంటల వ్యవధిలో ఏకంగా 22.5 మిలియన్ ట్వీట్లు పడటం విశేషం. మంగళవారం సాయత్రం 6 గంటలకు ‘హ్యాపీ బర్త్ డే ఎన్టీఆర్’ హ్యాష్ ట్యాగ్ మీద మొదలైన ట్వీట్ల వర్షం బుధవారం సాయంత్రం వరకు నిరాటంకంగా కొనసాగింది. ఉదయానికే 10 మిలియన్ ట్వీట్ల మార్కును దాటేసిన ఫ్యాన్స్.. ఆ తర్వాత కూడా అదే జోరును ప్రదర్శించారు. టాలీవుడ్లో బర్త్ డే ట్రెండ్స్‌లో ఇదే రికార్డు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మొత్తంగా సినీ ట్రెండ్స్ అన్నింట్లోనూ కూడా ఇది రికార్డని అంటున్నారు. ఈ మధ్య పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ‘గబ్బర్ సింగ్’ 8వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని 24 గంటల వ్యవధిలో 13.4 మిలియన్ ట్వీట్లతో రికార్డు నెలకొల్పగా.. దాన్ని తారక్ అభిమానులు అధిగమించారు. అంటే ఆగస్టు 9న మహేష్ బాబు అభిమానులు కొత్త టార్గెట్‌తో రంగంలోకి దిగాలన్నమాటే.
This post was last modified on May 21, 2020 1:43 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…