వాలిమై.. వాలిమై.. వాలిమై.. ఇప్పుడు తమిళ సినీ ప్రేక్షకుల నోళ్లలో ఎక్కడ చూసినా ఇదే మాట నానుతోంది. కోలీవుడ్ సూపర్ స్టార్లలో ఒకడైన అజిత్ కుమార్ హీరోగా నటిస్తున్న చిత్రమిది. కార్తితో ‘ఖాకి’ సినిమా తీసిన హెచ్.వినోద్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఇంతకుముందే అతను అజిత్‌తో ‘పింక్’ రీమేక్ తీశాడు. అది మంచి విజయమే సాధించింది. ఈసారి సొంత కథతో అజిత్ హీరోగా తీస్తున్న థ్రిల్లర్ మూవీ ‘వాలిమై’.
ఇందులో తెలుగు కథానాయకుడు కార్తికేయ విలన్ పాత్ర పోషిస్తుండటం విశేషం. ఈ చిత్రం ఏడాది కిందటే మొదలైంది. కానీ కరోనా ఇతర కారణాలతో షూటింగ్ ఆలస్యమైంది. ఐతే అజిత్ లాంటి స్టార్ హీరో సినిమా మొదలయ్యాక ఫస్ట్ లుక్ కోసం అభిమానులు ఎదురుచూడటం ఖాయం. సినిమా ఆరంభ దశలో ఉండగానే ఈ అప్‌డేట్ ఆశిస్తారు అభిమానులు. కానీ సినిమా మొదలై ఏడాది దాటినా ఇప్పటిదాకా ఫస్ట్ లుక్ రిలీజ్ కాలేదు.
‘వాలిమై’ అప్ డేట్ కోసం ఏడాది నుంచి అజిత్ అభిమానులు సోషల్ మీడియాలో ఉద్యమం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ‘వాలిమై అప్ డేట్ ప్లీజ్’ అంటూ అభిమానులు ప్లకార్డులు ప్రదర్శించడం విశేషం. ఇటీవల ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ సందర్భంగా ఇంగ్లాండ్‌లోని స్టేడియంలో కూడా ‘వాలిమై అప్ డేట్’ కోసం ప్లకార్డులు ప్రదర్శించడం గమనార్హం. ఇక సోషల్ మీడియాలో అజిత్ అభిమానులు చేసే హంగామా అంతా కాదు. దీన్నో పెద్ద ఉద్యమం లాగా మార్చేశారు.
ఐతే మేలో అజిత్ పుట్టిన రోజు సందర్భంగానే ఫస్ట్ లుక్ రిలీజ్ చేయాలనుకున్నారు కానీ.. అప్పటికి కరోనా ఉద్ధృతి కారణంగా వాయిదా వేశారు. ఐతే ఎట్టకేలకు ‘వాలిమై’ ఫస్ట్ లుక్ లాంచ్ చేయడానికి చిత్ర బృందం రెడీ అయినట్లు తెలుస్తోంది. ఇంకొన్ని రోజుల్లోనే ఫస్ట్ లుక్ లాంచ్ ఉంటుందట. దీంతో అజిత్ అభిమానుల ఆనందం మామూలుగా లేదు. సోషల్ మీడియాను మరోసారి హోరెత్తించేస్తున్నారు.
This post was last modified on June 25, 2021 7:07 pm
కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను ఉద్దేశించి సుప్రీంకోర్టు హెచ్చరిక చేసింది. ఆయన తప్పు చేసినట్టు నిరూపితమైతే.. కచ్చితంగా…
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు నిత్యం వివాదాల్లో ఉంటున్న సంగతి తెలిసిందే. అమరావతి రైతు ఉద్యమం ద్వారా వెలుగులోకి…
హిందీ దృశ్యం 3 బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. మొదటి మూడు రోజుల వసూళ్లు 270 కోట్లకు పైగా నమోదు కావడం…
షూటింగ్ సమయంలో ప్రమాదం వల్ల గాయపడిన నందమూరి బాలకృష్ణ కోలుకున్నారు. సుమారు రెండు నెలలు విశ్రాంతిలో ఉండి మళ్ళీ సినిమాలతో…
దసరా పండగ సందర్భంగా అక్టోబర్ 16 విడుదల కాబోతున్న రణబాలి చేతిలో కేవలం పదకొండు రోజులు మాత్రమే ఉన్నాయి. ట్రైలర్…
భర్త మరో మహిళతో కారులో కనిపించాడు. అది చూసిన భార్య వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించింది. కానీ భర్త కారు ఆపకుండా…