Movie News

మంచు మనోజ్ సెన్సేషన్ ఖాయమేనా?

టాలీవుడ్లో యాక్షన్ ఘట్టాల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టే హీరోల్లో మంచు మనోజ్ ఒకడు. ఎక్కువగా యాక్షన్ సినిమాలే చేసిన అతను.. ఫైట్లలో ఏదో ఒక ప్రత్యేకత చూపించాలని తపిస్తుంటాడు. కొన్నిసార్లు మనోజ్ సొంతంగా యాక్షన్ ఘట్టాలు కంపోజ్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి.

‘కరెంటు తీగ’ లాంటి కొన్ని సినిమాల్లో మనోజ్ చేసిన ఫైట్లు అప్పట్లో చర్చనీయాంశం అయ్యాయి. ఐతే వరుస ఫ్లాపుల కారణంగా మధ్యలో కొన్నేళ్లు జోరు తగ్గడం, పైగా దాదాపు రెండేళ్లు సినిమాలే లేక ఖాళీగా ఉండిపోవడంతో మనోజ్‌ను జనాలు పట్టించుకోవడం మానేశారు. ఐతే అతనిప్పుడు ‘అహం బ్రహ్మాస్మి’ అనే ప్రెస్టీజియస్ మూవీతో రీఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. శ్రీకాంత్ రెడ్డి అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ ఆసక్తి రేకెత్తించింది.

సరిగ్గా సినిమా చిత్రీకరణ మొదలు పెడదాం అనుకుంటుండగా లాక్ డౌన్ అడ్డం పడింది. లాక్ డౌన్ ఎత్తేయగానే చిత్రీకరణ మొదలుపెడతామంటున్న మనోజ్.. బుదవారం తన పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో మాట్లాడాడు. ప్రతి మనిషిలోనూ దేవుడు ఉంటాడని.. ఆ దేవుడిని తట్టి లేపాలి అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోందని చెప్పాడు. ఈ సినిమాలో యాక్షన్ ఘట్టాలకు అమితమైన ప్రాధాన్యం ఉందని.. వాటి కోసం తాను కత్తి ఫైటు, కర్రసాము సాధన చేస్తున్నానని చెప్పాడు మనోజ్.

ఈ చిత్రం కోసం తొలిసారి పీటర్ హెయిన్స్‌తో కలిసి పని చేస్తున్నానని.. ఫైట్ల కోసమే 50 రోజులు కేటాయించబోతున్నామని చెప్పాడు. మనోజ్‌కు మామూలుగానే ఫైట్లంటే పిచ్చి. పైగా సినిమాలో యాక్షన్‌కు బాగా స్కోప్ ఉందంటున్నారు. అందులోనూ నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ ఈ చిత్రానికి పని చేస్తున్నాడు. మనోజ్ కూడా ఎంతో సాధన చేసి రంగంలోకి దిగుతున్నాడు. కాబట్టి ఈ చిత్రంలో యాక్షన్ ఘట్టాలతో మనోజ్ సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నాడన్నమాటే.

This post was last modified on May 20, 2020 2:51 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

28 minutes ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

2 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

2 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

3 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

3 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

4 hours ago