ఊహించని విధంగా తెలంగాణలో లాక్ డౌన్ పూర్తి స్థాయిలో ఎత్తేస్తూ థియేటర్లు, మాల్స్ సహా అన్నీ తెరుచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతులు ఇచ్చేసింది. సినీ జనాలకు ఇది ఒకింత ఆశ్చర్యం కలిగించే విషయమే. లాక్ డౌన్ ఎత్తేసినా థియేటర్ల మీద ఆంక్షలు ఉంటాయని భావించారు. కానీ అలాంటిదేమీ లేకపోయింది. 50 పర్సంట్ ఆక్యుపెన్సీ అంటూ షరతులు కూడా ఏమీ లేవు. ఎప్పట్లాగే థియేటర్లను పూర్తి స్థాయిలో నడుపుకోవచ్చు.
ఈ వెసులుబాటు ఇచ్చేశారు కదా అని థియేటర్లను నడిపిద్దామంటే సినిమాలు లేని పరిస్థితి. ఎవ్వరూ అసలు థియేటర్లే తెరవలేదు. పున:ప్రారంభానికి థియేటర్లు రెడీ చేస్తున్నప్పటికీ.. కనీసం జులై మొదటి వారం నుంచి అయినా అవి కళకళలాడుతాయా అంటే అలాంటి సంకేతాలేమీ కనిపించడం లేదు. ఆగస్టు వరకు ఎదురు చూడక తప్పేలా లేదన్నది ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
కాస్త పేరున్న సినిమాలను రిలీజ్ చేయాలన్నా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ థియేటర్లు తెరుచుకోవాలి. ఏ ఆంక్షలూ లేకుండా పూర్తి స్థాయిలో థియేటర్లు నడవాలి. కానీ ఏపీలో ఇంకా పాక్షికంగా లాక్ డౌన్ నడుస్తోంది. సాయంత్రం 6 గంటల తర్వాత కర్ఫ్యూ అమలవుతోంది. థియేటర్లలో రోజుకు నాలుగు షోలు నడిపించే పరిస్థితి లేదు. పైగా ఆక్యుపెన్సీ విషయంలో స్పష్టత కొరవడింది. దీంతో అక్కడ థియేటర్లు ఇప్పుడిప్పుడే తెరుచుకునే పరిస్థితి లేదు. పైగా అక్కడ టికెట్ల రేట్ల విషయంలో పీఠముడి బిగుసుకుంది.
ఈ సమస్యలన్నీ పరిష్కారమై ఒకప్పట్లా థియేటర్లు నడవాలంటే నెల రోజులకు పైగానే పట్టేలా ఉంది. ఆగస్టు మొదటి వారానికి కాపీ ఆ పరిస్థితులు రాకపోవచ్చు. అందుకే ఇటు నిర్మాతలు, అటు ఎగ్జిబిటర్లు వేచి చూసే ధోరణిలో ఉన్నారు. జులైలో థియేటర్లు తెరుచుకున్నప్పటికీ పాత సినిమాలనే నెల పాటు నడిపించి.. ఆ తర్వాత పరిస్థితులను బట్టి కొత్త చిత్రాలను విడుదల చేస్తారని అంచనా వేస్తున్నారు.
This post was last modified on June 23, 2021 3:07 pm
అదేంటో పోలీస్, క్రైమ్ మీద మలయాళంలో ఎన్ని సినిమాలు వచ్చినా వాటికి కేరళ ప్రేక్షకులు ఆదరణ అందిస్తూనే ఉంటారు. తాజాగా…
టాలీవుడ్ మూవీ లవర్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కాంబినేషన్ హీరో వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ జంటది. రచయితగా…
అమెరికాలో గ్రీన్‌కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వస్తే భారత్‌కు భారీ లాభం జరుగుతుందా? ఇండియన్…
పేరున్న హీరో హీరోయిన్లు లేకపోయినా.. ప్రి రిలీజ్ బజ్ కూడా పెద్దగా లేకపోయినా.. కంటెంట్‌తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని పెద్ద…
ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…
సందీప్ రెడ్డి వంగనే కాదు.. ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాదని.. ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్…