కన్నడ హీరో, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి తనయుడు నిఖిల్ గౌడ.. త్వరలో తండ్రి కాబోతున్నాడు. గతేడాది లాక్ డౌన్ సమయంలో.. కుమారస్వామి కుమారుడు నిఖిల్… పెళ్లి జరిగిన సంగతి తెలిసిందే. రేవతి అనే యువతిని నిఖిల్ పెళ్లాడాడు. కాగా… ఇప్పుడు ఈ నిఖిల్, రేవతి జంట త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు.
ప్రస్తుతం రేవతి ఐదు నెలల గర్భవతి. దీంతో.. ఈ జంటకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువిరుస్తున్నాయి. ఇదిలా ఉండగా.. నిఖిల్.. ఇటీవల తన భార్యకు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ తెలియజేశారు.
కాగా… గతేడాది లాక్ డౌన్ సమయంలో.. అంటే ఏప్రిల్ 17, 2020లో అతి కొద్ది మంది అతిథుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. జాగ్వార్ సినిమాతో హీరోగా మెరిసిన నిఖిల్ గౌడకు మంచి పొలిటికల్ బ్యాగ్రౌండ్ ఉంది. తాత దేవగౌడ మాజీ ప్రధాని కాగా.. తండ్రి కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి. ఇక నిఖిల్ పెళ్లి చేసుకున్న రేవతి తండ్రి రేవన్న కూడా కన్నడలో మంచి పేరున్న పొలిటికల్ లీడర్.
ఇదిలా ఉండగా.. నిఖిల్.. సినిమాల్లో హీరోగా కూడా నటించారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. గత ఎన్నికల్లో మాండ్యా నియోజకవర్గం నుంచి పోటీ చేసి… ఓటమి పాలయ్యారు.
This post was last modified on June 22, 2021 1:00 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…