ఎన్టీఆర్ పుట్టిన రోజుకు ‘ఆర్ఆర్ఆర్’ టీం నుంచి ఏదో ఒక కానుక ఉంటుందని ఆశించి.. అలాంటిదేమీ లేదని తేలాక నిరాశతో ఉన్నారు అభిమానులు. ఈ అప్ డేట్ వచ్చాక నిన్నంతా నిరాశలో మునిగిపోయి.. ఈ రోజు కోలుకుని బర్త్ డే ట్రెండ్స్ కోసం రెడీ అయిపోయారు. ఈ రోజు సాయంత్రం నుంచి ట్విట్టర్లో హంగామా మొదలు కాబోతోంది.
24 గంటల వ్యవధి పెట్టుకుని బర్త్ డే ట్రెండ్స్‌తో రికార్డులు కొట్టాలని చూస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ నుంచి కానుక లేకపోయినా.. తారక్ ఫ్యాన్స్‌ను ఎంగేజ్ చేయడం కోసం పీఆర్వో టీం కొన్ని ప్రత్యేక ఏర్పాట్లే చేసినట్లు తెలుస్తోంది. ఈ రోజు సాయంత్రం నుంచి అభిమానుల కోసం కొన్ని కానుకలు రెడీ చేసి ఏ టైంకు ఏం చేయాలో, ఏం అప్ డేట్స్ ఉంటాయో షెడ్యూల్ ఇచ్చింది.
మంగళవారం సాయంత్రం 6 గంటలకు ఎన్టీఆర్ పుట్టిన రోజుకు ట్రెండ్ చేయాల్సిన హ్యష్ ట్యాగ్‌ను ప్రకటించనున్నారు. 8 గంటలకు ఎన్టీఆర్ మీద స్పెషల్ లైవ్ వైర్ డ్యాన్స్ వీడియో ఉంటుంది. 9 గంటలకు లైఫ్ ఆఫ్ ఎన్టీఆర్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేస్తారు.
10 గంటలకు దయా మాషప్ ఉంటుంది. 11 గంటలకు ఫ్యాన్ ఆఫ్ ఫ్యాన్స్ వీడియో రిలీజ్ చేస్తారు. ఇందులో అభిమానుల గురించి తారక్ వివిధ సందర్భాల్లో ఇచ్చిన స్పీచ్‌ల మాషప్ ఉంటుంది. 11 గంటలకు ఎన్టీఆర్‌కు సంబంధించి ఇంతకుముందు ఎన్నడూ చూడని స్టిల్‌తో విషెస్ చెబుతారు. ఆ వెంటనే లైఫ్ ఆఫ్ ఎన్టీఆర్ ఫుల్ పిక్ రిలీజ్ చేస్తారు.
అర్ధరాత్రి ఒంటి గంట నుంచి ఉదయం 6 గంటల వరకు ఎన్టీఆర్ అన్ సీన్ పిక్స్ రిలీజ్ చేస్తారు. ఇవన్నీ ఎన్టీఆర్ అభిమానులు అనుసరించే అఫీషియల్ హ్యాండిల్ ‘ట్రెండ్ జూనియర్ ఎన్టీఆర్’ నుంచి రాబోయే అప్ డేట్స్. మరోవైపు యువ కథానాయకుడు విశ్వక్సేన్ ఎన్టీఆర్ కోసం రూపొందించిన పాట కూడా రిలీజ్ కాబోతోంది. ఇక తారక్ ఫ్యాన్స్ కోసం రేపు ఏదో ఒక సర్ప్రైజ్ ఉంటుందని పీఆర్వో కమ్ ప్రొడ్యూసర్ మహేష్ కోనేరు ఊరిస్తున్నాడు.
This post was last modified on May 19, 2020 2:33 pm
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…
మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…
తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మనసు పారేసుకున్నారని, లేటు వయసులో…
ఏపీ రాజధాని అమరావతి అందరిదీ. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజల పరంగా ఎక్కడా రాజధానిపై వ్యతిరేకత కూడా…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్.. ఒకప్పుడు టాలీవుడ్‌కు నాలుగు స్తంభాల్లా నిలబడ్డ స్టార్ హీరోలు.…
ప్రభాస్ సినిమా అంటేనే భారీ యుద్ధాలు, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు గుర్తొస్తాయి. అయితే వరుసగా అవే చేయడం…