తమిళ స్టార్ హీరో విజయ్ కెరీర్లో చాలా ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ చిత్రం ‘తుపాకి’. ఎక్కువగా రొటీన్ మాస్ మసాలా సినిమాలు చేసే విజయ్.. మురుగదాస్ దర్శకత్వంలో చేసిన ఈ చిత్రం అతణ్ని కొత్తగా ప్రెజెంట్ చేసింది. సెన్స్ లెస్ మాస్ ఎలివేషన్లు.. రొటీన్ సీన్లు లేకుండా ఒక భిన్నమైన కథతో స్టైలిష్‌గా, ఇంటెన్స్‌గా సాగి ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులనూ ఆకట్టుకుంది. తెలుగులో కూడా విజయ్‌కు ఫాలోయింగ్ పెరగడంలో ఈ సినిమా కీలకం. దీని తర్వాత మురుగదాస్‌తో కత్తి, సర్కార్ చిత్రాలు చేశాడు విజయ్. కత్తి బ్లాక్‌బస్టర్ కాగా.. సర్కార్ నిరాశ పరిచింది.
ఆ తర్వాత వీళ్లిద్దరూ కలిసి నాలుగో చిత్రం చేయడానికి గత ఏడాది రెడీ అయ్యారు. ఈ సినిమా గురించి అనౌన్స్‌మెంట్ కూడా వచ్చింది. కానీ ఏమైందో ఏమో.. ఉన్నట్లుండి ఈ సినిమా ఆగిపోయింది. విజయ్.. నెల్సన్ దిలీప్ కుమార్ అనే వేరే దర్శకుడితో సినిమా మొదలుపెట్టాడు. దీంతో మురుగదాస్ అయోమయంలో పడిపోయాడు.
విజయ్‌తో మురుగదాస్ చేయాలనుకున్నది ‘తుపాకి’ సీక్వెల్ అని అప్పట్లో వార్తలొచ్చాయి. మరి విజయ్ కోరుకున్నట్లుగా స్క్రిప్టు తయారు కాలేదో మరో కారణమో తెలియదు కానీ.. ఈ ప్రాజెక్టు ఆగిపోయాక మురుగదాస్ పరిస్థితి ఇబ్బందికరంగా తయారైంది. అతడి కొత్త సినిమా హీరోగా రకరకాల పేర్లు వినిపించాయి. తెలుగు స్టార్లు అల్లు అర్జున్, రామ్‌ల పేర్లూ ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పటిదాకా మురుగ కొత్త సినిమా ఖరారైనట్లు కనిపించలేదు.
ఐతే ఇప్పుడేమో అతను.. లెజెండరీ నటుడు కమల్ హాసన్‌తో జట్టు కట్టబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ‘తుపాకి’ సీక్వెల్‌ను కమల్‌తో చేయబోతున్నాడని.. ఆయన ఇమేజ్‌కు తగ్గట్లు కథను మారుస్తున్నాడని కోలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కొన్ని రోజుల ముందైతే కమల్, మహేష్ బాబుల కలయికలో మురుగదాస్ ఓ మల్టీస్టారర్ తీయబోతున్నట్లు కూడా ప్రచారం జరగడం విశేషం. కానీ అది నిజం కాదని తేలింది. కమల్‌తో ‘తుపాకి’ సీక్వెల్ గురించి ఇప్పుడు ప్రచారం నడుస్తోంది. ఇదెంత వరకు నిజమో చూడాలి.
This post was last modified on June 20, 2021 4:39 pm
ప్రభాస్ తన లైనప్ లో ఎన్ని క్రేజీ కాంబినేషన్స్ సెట్ చేసినా కూడా హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఫోకస్ మాత్రం…
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షం వైసీపీ లేని లోటును టీడీపీ ఎమ్మెల్యేలే తీర్చేస్తున్నారు. నిజానికి వైసీపీ ఉంటే కూడా ఇంతగా…
టాలీవుడ్లో అయినా.. మొత్తం ఇండియాలో అయినా… సోషల్ మీడియాలో అత్యధిక ట్రోలింగ్ ఎదుర్కొన్న మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే మరో…
మాములుగా ఎంత పెద్ద సినిమా అయినా సరే మూడో వారంలోకి వచ్చాక నెమ్మదించడం సహజం. కానీ అమరన్ మాత్రం ఈ…
తెలుగు సినిమా చరిత్రలోనే గొప్ప దర్శకుల్లో సుకుమార్ ఒకరు అనడంలో సందేహం లేదు. 20 ఏళ్ల కిందట్నుంచి సినిమాలు తీస్తున్న…
అత్తారింటికి దారేది సినిమాలో ఎంఎస్ నారాయణ చెప్పినట్టు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే విజేత. దీన్ని సరిగ్గా…