తన సినిమాల్లో యాక్షన్ ఘట్టాలనే కాదు.. పాటలను కూడా ఉద్వేగభరితంగా, ఎంతో ఆకర్షణీయంగా తీస్తుంటాడు రాజమౌళి. చివరగా రాజమౌళి తీసిన బాహుబలిః కంక్లూజన్ సినిమాలో టైటిల్ సాంగ్.. అలాగే హంసనావ.. దండాలయ్యా పాటలు ప్రేక్షకులకు ఎంత గొప్ప అనుభూతినిచ్చాయో తెలిసిందే. ఇప్పుడు జక్కన్న నుంచి వస్తున్న ఆర్ఆర్ఆర్‌లోనూ అద్భుతమైన పాటలుంటాయని సమాచారం.
అందులోనూ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ల మీద జక్కన్న ఒక ఎపిక్ సాంగ్ తీస్తున్నాడట. అది టాలీవుడ్లో ప్రత్యేకంగా నిలిచిపోయే పాట అవుతుందని చిత్ర వర్గాలు అంటున్నాయి. ఏకంగా 8 నిమిషాల నిడివితో సుదీర్ఘంగా, ఉద్వేగభరితంగా ఆ పాట సాగుతుందట. ఈ పాటకు అద్భుతమైన లిరిక్స్, ట్యూన్ రెడీ అయ్యాయని.. దీని చిత్రీకరణ కూడా ప్రత్యేకంగా ఉంటుందని సమాచారం.
ఈ పాటను దాదాపు 20 రోజుల పాటు చిత్రీకరించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని.. కొత్త షెడ్యూల్లో ఈ పాటను షూట్ చేయబోతున్నారని తెలిసింది. ఇప్పుడు ఈ పాటకు సంబంధించిన విశేషాలు టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారాయి. లాక్ డౌన్ కారణంగా రెండు నెలల కిందటే ఆర్ఆర్ఆర్ షూటింగ్ ఆపేశారు. జులైలో కొత్త షెడ్యూల్ మొదలుపెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. చిత్ర ప్రధాన తారాగణమంతా షూటింగ్‌లో పాల్గొనబోతోంది. వీలైనంత త్వరగా చిత్రీకరణ పూర్తి చేసి.. ఆ తర్వాత దాదాపు ఆరు నెలలు పోస్ట్ ప్రొడక్షన్ పనులపై కూర్చోబోతున్నారు.
ఈ చిత్రాన్ని బహు భాషల్లో రిలీజ్ చేయాల్సి ఉండటం, వీఎఫ్ఎక్స్ పనులు కూడా చాలా ఉండటంతో పోస్ట్ ప్రొడక్షన్‌కు చాలా సమయం వెచ్చించాల్సి ఉంది. వీలును బట్టి వచ్చే సంక్రాంతికి లేదంటే వేసవికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తేవాలని భావిస్తున్నారు.
This post was last modified on June 20, 2021 9:53 am
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…