ధనుష్-శేఖర్ కమ్ముల.. ఈ రెండు పేర్లనూ కలిపి మాట్లాడుకుంటామని ఎవ్వరూ ఊహించి ఉండరు. వీళ్ల కలయికలో సినిమా రాబోతుండటం అందరికీ పెద్ద షాకే. ఈ దిశగా ఎప్పుడూ సంకేతాలే కనిపించలేదు. ఉన్నట్లుండి ఈ క్రేజీ కాంబినేషన్లో సినిమా గురించి ప్రకటన వచ్చింది. దీని గురించి ముందు రోజు బజ్ కనిపించగానే.. ఇదెలా సాధ్యం అన్నట్లుగా చూశారు అందరూ. కానీ శుక్రవారం ఉదయం ఈ విషయాన్నే అధికారికంగా ప్రకటించారు.
ముందు షాక్‌కు గురై.. ఆ తర్వాత నెమ్మదిగా విషయాన్ని జీర్ణించుకుంటున్న ప్రేక్షకులు.. వీరి కలయికలో ఎలాంటి సినిమా వస్తుందా అని ఆలోచిస్తున్నారు. శైలి ప్రకారం చూస్తే ధనుష్, శేఖర్‌లవి భిన్నమైన దారులు. ఇద్దరూ కొత్తదనం కోసం ప్రయత్నించేవాళ్లే కానీ.. వాళ్ల సినిమాలు మాత్రం ఒకలా ఉండవు.
కెరీర్ ఆరంభం నుంచి చూస్తే ధనుష్ చాలా వరకు టిపికల్ క్యారెక్టర్లు చేశాడు. అతను మామూలు అబ్బాయిలా కనిపించడం తక్కువ. బాగా ఇంటెన్స్‌గా ఉండే.. చాలా వయొలెంట్‌గా బిహేవ్ చేసే పాత్రలకే ప్రాధాన్యం ఇస్తుంటాడు. ధనుష్‌కు పేరు తెచ్చిన కాదల్ కొండేన్, పుదుప్పేట్టై, ఆడుగళం, వడ చెన్నై, అసురన్ లాంటి సినిమాలు అందుకు ఉదాహరణ. ఎప్పుడో కానీ అతను ఎంటర్టైనర్లు చేయడు. ఒకవేళ చేసినా అవి మాస్ మసాలా టైపులో ఉంటాయి. ఇక శేఖర్ విషయానికి వస్తే అతడి సినిమాలు ధనుష్ చిత్రాలకు పూర్తి భిన్నంగా.. చాలా సాఫ్ట్‌గా ఉంటాయి. చాలా వరకు పక్కింటి అబ్బాయి పాత్రలనే హీరోలుగా చూపిస్తుంటాడు శేఖర్.
‘లీడర్’లో హీరోను సీఎంగా చూపించినప్పటికీ.. అది కూడా సాఫ్ట్‌గానే ఉంటుంది. అలాంటి దర్శకుడు ధనుష్ లాంటి టిపికల్ క్యారెక్టర్లు చేసే హీరోతో ఎలాంటి సినిమా తీస్తాడో ఒక అంచనాకు రాలేకపోతున్నారు ప్రేక్షకులు. అసలు వేర్వేరు దారుల్లో ప్రయాణం చేసే ఈ ఇద్దరూ కలిసి సినిమా చేయడానికి ఎలా ముందుకొచ్చారు.. ఎవరు ఎవరిని సంప్రదించారు అన్న ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. విశేషం ఏంటంటే.. తెలుగులో ఇప్పటిదాకా ఏ స్టార్‌తోనూ పని చేయని శేఖర్.. నేరుగా ఓ తమిళ స్టార్‌తో సినిమాకు రెడీ అయిపోవడమూ ఆశ్చర్యంగానే ఉంది. మరి వీరి కలయిక ఎలాంటి సెన్సేషన్‌కు దారి తీస్తుందో చూడాలి.
This post was last modified on June 18, 2021 10:47 pm
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై జరుగుతున్న విచారణలో రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి.ప్రకాశ్ కీలక సమాచారాన్ని…
బతుకుదెరువు కోసం ఎక్కడెక్కడికో వెళ్లిన వారు తమ ఇళ్లకు వెళుతున్నారు. ఇంటికొచ్చిన వారు బతుకుదెరువు కోసం కార్యస్థానాలకు బయలుదేరారు. అందరికీ…
బాలీవుడ్లో ఒకప్పుడు నిలకడగా సూపర్ హిట్ సినిమాలు అందిస్తూ వైభవం చూసిన నటుడు అక్షయ్ కుమార్. ఖాన్ త్రయం భారీ…
ఏపీలోని కూటమి సర్కారు బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతిలో జరిగిన తొక్కిసలాటపై న్యాయ విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ…
దేశంలో ఇంకా అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. నానాటికీ అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీతో పోటీ పడి మరీ పరుగులు పెడుతుంటే… దేశ…
రామ్ గోపాల్ వర్మలో ఎప్పుడూ లేని పశ్చాత్తాప భావన చూస్తున్నాం ఇప్పుడు. ఒకప్పుడు రంగీలా, సత్య లాంటి క్లాసిక్స్ తీసిన…