ఎవరికీ తెలియని విషయాన్ని తాను చెబుతున్నట్లుగా మెగా బ్రదర్ నాగబాబు ఆసక్తికర అంశాల్ని వెల్లడించారు. సందర్బం వచ్చింది కాబట్టి చెబుతున్నానని.. మామూలుగా అయితే తాము చేసిన సాయం గురించి బయటకు చెప్పుకోమని.. ఇప్పటివరకు తాను చెప్పిన విషయాలేవీ మీడియాకు తెలీవంటూ ఊరించేశారు. ఇంతకూ విషయం ఏమంటే.. తన అన్న కోడలు ఉపాసన గొప్పతనం గురించి.. ఆమె పెద్ద మనసు గురించి నాగబాబు గొప్పల చిట్టాను బయటపెట్టారు.
కరోనా టైంలో తమ కోడలు ఉపాసన పెద్ద మనసుతో వ్యవహరించినట్లు చెప్పారు. తాము చాలామందికి ట్రీట్ మెంట్ ఇప్పించామన్నారు. హైదరాబాద్ లో అపోలో ఆసుపత్రి చాలా పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ అని.. అయినప్పటికీ కరోనా టైంలో చాలా తక్కువ ఖర్చుకు ట్రీట్ మెంట్ అందించారన్నారు. అంత తక్కువ ఖర్చుకు ఎలా ట్రీట్ మెంట్ ఇప్పిస్తున్నారమ్మా? అని తాను అడిగితే.. ఇలాంటి టైంలోనే కదా పది మందికి ఉపయోగపడాలని సమాధానం ఇచ్చిందంటూ ఉపాసన గొప్పతనాన్ని చెప్పుకొచ్చారు.
ఉపాసన చెప్పిన సమాధానానికి చాలా సంతోషమేసిందని.. ఎంతైనా మా అన్నయ్యకు తగ్గ కోడలు అనిపించిందని.. అన్నయ్య కూడా ఉపాసనకు ఎంతోమందికి సాయం చేయాలని కోరినట్లు చెప్పారు. సినీ కార్మికులందరికి అన్నయ్య వ్యాక్సిన్ వేయించారంటే అదంతా ఉపాసన సాయంతోనేనని చెప్పారు. మొత్తానికి అన్నయ్య ఇమేజ్ ను పెంచటమే కాదు.. కోడలు ఉపాసన పెద్ద మనసును అందరికి అర్థమయ్యేలా నాగబాబు చెప్పారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates