రుసో బ్రదర్స్.. హాలీవుడ్ సినిమాలను ఫాలో అయ్యే వాళ్లకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. ప్రస్తుతం వరల్డ్ హైయెస్ట్ గ్రాసర్ రికార్డుతో కొనసాగుతున్న ‘ఎవెంజర్స్: ది ఎండ్ గేమ్’ సృష్టికర్తలు వీళ్లే. దీని కంటే ముందు ‘ఎవెంజర్స్: ది ఇన్ఫినిటీ వార్’, ‘కెప్టెన్ అమెరికా: సివిల్ వార్’, ‘కెప్టెన్ అమెరికా: ది వింటర్ సోల్జర్’ లాంటి భారీ చిత్రాలను రూపొందించింది ఈ దర్శక ద్వయం.
ప్రస్తుతం వీళ్లిద్దరూ నెట్ ఫ్లిక్స్ కోసం ‘ది గ్రే మ్యాన్’ అనే భారీ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ర్యాన్ గాస్లింగ్, క్రిస్ ఎవాన్స్,అనా డి అర్మాస్ లాంటి ప్రముఖ అంతర్జాతీయ నటులు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో తమిళ నటుడు ధనుష్ కూడా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తుండటం విశేషం. ఇప్పటికే ‘ఫాకిర్’ పేరుతో ఓ ఇంటర్నేషనల్ మూవీ చేశాడు ధనుష్. ఇప్పుడు ఏకంగా రుసో బ్రదర్స్ దర్శకత్వంలో భారీ హాలీవుడ్ చిత్రంలో నటిస్తుండటం మన దేశానికే గర్వకారణం.
రుసో బ్రదర్స్ ఆషామాషీగా ఏమీ ధనుష్‌ను ‘ది గ్రే మ్యాన్’ కోసం ఎంచుకుని ఉండరు. అతడి ప్రతిభ గురించి వారికి బాగానే తెలిసి ఉంటుంది. తన సినిమాలను వాళ్లు ఫాలో అవుతూనే ఉంటారు. ఇందుకు ఉదాహరణ.. తాజాగా వాళ్లు వేసిన ట్వీట్. శుక్రవారం ధనుష్ కొత్త చిత్రం ‘జగమే తంత్రం’ నెట్ ఫ్లిక్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ముందు రోజు ఆ ట్రైలర్‌ను షేర్ చేస్తూ రుసో బ్రదర్స్ ట్వీట్ చేశారు. అంతే కాదు.. ‘సూపర్ డా తంబీ’ (సూపర్ రా తమ్ముడూ) అంటూ తమిళ పదాలతో వాళ్లు ట్వీట్ వేయడం విశేషం.
ధనుష్‌తో కలిసి ‘ది గ్రే మ్యాన్’ కోసం పనిచేస్తుండటం చాలా సంతోషంగా ఉందని కూడా పేర్కొన్నారు. దీనికి ధనుష్ స్పందిస్తూ.. రుసో సోదరులు ఇలా ట్వీట్ వేయడం తనకు చాలా పెద్ద విషయమని అన్నాడు. మళ్లీ రుసో బ్రదర్స్ అతడికి బదులిస్తూ.. ధనుష్‌తో పని చేయడం ఆనందదాయకమని పేర్కొన్నారు.
This post was last modified on June 18, 2021 10:00 am
ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…
కేంద్ర హోం శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ మండలి సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాలక్షేపానికి తినే…
తెలంగాణ అసెంబ్లీలో టాలీవుడ్ కు సంబంధించి ఎప్పుడూ జరగనంత వాడి వేడి చర్చ ఇవాళ కనిపించడం ఇండస్ట్రీ వర్గాలనే కాదు…