యువ కథానాయకుడు నితిన్ కెరీర్లో చాలా వరకు సినిమాలు పేరున్న దర్శకులతో చేసినవే. కథానాయకుడిగా తొలి అడుగులు వేస్తున్నపుడే తేజ, వినాయక్, రాజమౌళి, రాఘవేంద్రరావు లాంటి పెద్ద పెద్ద దర్శకులతో అతను సినిమాలు చేశాడు. మధ్యలో వరుస పరాజయాల తర్వాత ఇష్క్‌తో కోలుకున్న అతను.. ఆ తర్వాత పూరి జగన్నాథ్, త్రివిక్రమ్ లాంటి స్టార్ దర్శకులతో పని చేశాడు. ఈ యంగ్ హీరోకు కొత్త దర్శకులంటే మాత్రం కొంచెం దడే.
విజయ్ కుమార్ కొండాతో చేసిన గుండెజారి గల్లంతయ్యిందే మినహాయిస్తే.. అతడికి డెబ్యూ డైరెక్టర్లతో చేదు అనుభవాలు ఉన్నాయి మరి. హీరో (జీవీ), ద్రోణ (కరుణ్ కుమార్), కొరియర్ బాయ్ కళ్యాణ్ (ప్రేమ్ సాయి) సినిమాలు అందుకు ఉదాహరణ. అయితే కొంత గ్యాప్ తర్వాత నితిన్ మళ్లీ ఇప్పుడు ఓ కొత్త దర్శకుడితో సినిమా చేయబోతున్నట్లు సమాచారం.
ఐతే ఆ డెబ్యూ డైరెక్టర్‌కు సినిమాలకు సంబంధించి లోతైన అవగాహన, అనుభవమే ఉంది. నితిన్ పని చేయబోయేది టాలీవుడ్లో పేరున్న ఎడిటర్లలో ఒకడైన ఎస్‌ఆర్ శేఖర్‌తో కావడం విశేషం. ఎడిటింగ్‌లో చాలా ఏళ్ల అనుభవం ఉన్న ఎస్ఆర్ శేఖర్.. ఇటీవలే నితిన్‌కు ఒక కథ చెప్పి ఒప్పించాడట. అతడి పనితనం మీద భరోసాతో సినిమా చేయడానికి ఓకే అన్నాడట. అవసరమైతే నితిన్ సొంత బేనర్లో ఈ సినిమా చేయడానికి రెడీగా ఉన్నాడట.
ప్రస్తుతం అంధాదున్ రీమేక్ మేస్ట్రోలో నటిస్తున్న నితిన్.. దీని తర్వాత వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ సినిమా మొదలుపెట్టనున్న సంగతి తెలిసిందే. చెక్, రంగ్‌దె సినిమాల పరాజయంతో ఇబ్బంది పడ్డ నితిన్.. కృష్ణచైతన్యతో చేయాల్సిన పవర్ పేట సినిమాను హోల్డ్‌లో పెట్టిన సంగతి తెలిసిందే.
This post was last modified on June 17, 2021 9:55 am
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…