Movie News

దిల్ రాజు.. పాన్ ఇండియా స్టార్

తెలుగులో అగ్ర నిర్మాతల్లో ఒకడిగా ఎదిగిన దిల్ రాజు.. అంతటితో సంతృప్తి చెందేలా కనిపించడం లేదు. పాన్ ఇండియా లెవెల్లోటాప్ ప్రొడ్యూసర్లలో ఒకడిగా పేరు సంపాదించే ప్రయత్నంలో ఆయన ఉన్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే ‘జెర్సీ’, ‘ఎఫ్-2’ చిత్రాల రీమేక్‌లతో ఆయన బాలీవుడ్‌లో అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రాజు దృష్టి కోలీవుడ్ మీద పడింది. ఒకటి తర్వాత ఒకటి అన్నట్లు ఆయన కోలీవుడ్ ప్రముఖులతో సినిమాలు లైన్లో పెడుతుండటం చర్చనీయాంశంగా మారింది. అవన్నీ భారీ ప్రాజెక్టులే కావడం విశేషం.

రామ్ చరణ్ హీరోగా తమిళ లెజెండరీ డైరెక్టర్ శంకర్‌తో రాజు ఓ సినిమాను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. శంకర్‌తో సినిమా చేయాలని ఎన్నో ఏళ్లుగా ఎంతోమంది తెలుగు హీరోలు, నిర్మాతలు ప్రయత్నించారు. కానీ ఫలితం లేకపోయింది. ఐతే శంకర్ దర్శకత్వంలో ‘ఇండియన్-2’ సినిమాను తనే నిర్మించడానికి ముందుకొచ్చి వెనక్కి తగ్గిన రాజు.. దాని తర్వాత శంకర్ చిత్రాన్ని తనే దక్కించుకున్నాడు. చరణ్‌తో సినిమాను కమిట్ చేయించాడు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో తీయడానికి రాజు భారీ ప్రణాళికలతో సిద్ధమవుతున్నాడు.

మరోవైపు తమిళంలో ప్రస్తుతం నంబర్‌వన్ హీరో అనదగ్గ విజయ్‌తోనూ రాజు సినిమా చేయబోతుండటం విశేషం. గత కొన్నేళ్లలో ఇంతింతై అన్నట్లు ఎదిగిపోయి, రజినీకాంత్‌ను కూడా వెనక్కి నెట్టేసిన విజయ్‌కు తెలుగులో కూడా ఫాలోయింగ్ పెరిగింది. దీన్ని క్యాష్ చేసుకుంటూ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ హీరోగా సినిమాకు రంగం సిద్ధం చేశాడు రాజు. విజయ్‌కు దాదాపు వంద కోట్ల పారితోషకం ఇస్తున్నాడట ఈ చిత్రం కోసం. ఇది కూడా పాన్ ఇండియా మూవీనే.

తాజాగా సూర్య హీరోగా కూడా మరో చిత్రాన్ని రాజు ఓకే చేసినట్లు వార్తలొస్తున్నాయి. బోయపాటి శ్రీను ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తాడట. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కబోతోంది. ఇలా వరుసగా రాజు తమిళ హీరోలు, దర్శకులతో సినిమాలు సెట్ చేస్తుండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తెలుగులో ఆయన హవా గురించి కొత్తగా చెప్పేదేమీ లేదు. ఇప్పుడిక హిందీ, తమిళంలోనూ క్రేజీ ప్రాజెక్టులు లైన్లో పెడుతున్నాడు. ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ఓ భారీ పాన్ ఇండియా చిత్రం కూడా లైన్లో పెడుతున్న నేపథ్యంలో మున్ముందు జాతీయ స్థాయిలో రాజు పేరు మార్మోగేలాగే కనిపిస్తోంది.

This post was last modified on June 16, 2021 6:20 pm

Share

Recent Posts

రాజమౌళి టచ్ చేసిన స్క్రిప్ట్… హిట్ కొడతారా?

గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…

17 minutes ago

దృశ్యం బ్రాండ్ విలువ మహత్యం

బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…

36 minutes ago

టీ 20 చూస్తూ పారిశ్రామికవేత్తలతో చర్చించా

నేను క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి ఎక్కడికివెళ్లినా అక్కడ కూడా పెట్టుబడుల మీద ఒప్పందాల గురించి చర్చిస్తుంటాను. ఒక టీ 20…

41 minutes ago

సుడిగుండంలో చిక్కుకున్న జ‌గ‌న్ .. !

గ‌తంలో అంటే.. 2012 నాటి ప‌రిస్థితుల‌ను గ‌మ‌నిస్తే.. జ‌గ‌న్‌కు పెద్ద మైన‌స్ అనే చెప్పాలి. అప్ప‌ట్లో ఆయ‌న‌పై అక్ర‌మాస్తుల కేసులు…

2 hours ago

ప్రజల మన్ననలు పొందుతున్న లేడీ లీడర్

గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన ఒక‌రిద్ద‌రు టీడీపీ అభ్య‌ర్థులు ప‌ట్టు బిగిస్తున్నారు. త‌మ‌కు మంత్రి నారా లోకేషే ఆద‌ర్శమ‌ని కూడా చెబుతున్నారు.…

4 hours ago

నార్త్ రాముడు.. సౌత్ శివుడు… రేవంత్ కరెక్టేనా?

రాజకీయాల్లో కీలక స్థానాల్లో ఉండే వారి నుంచి వచ్చే మాటల వెనుక ఊహకు అందని లెక్కలు.. సమీకరణాలు ఉంటాయి. అందునా..…

5 hours ago