హీరోయిన్లు కెరీర్ చరమాంకంలో వచ్చేసరికి ప్రేమలో పడటం.. పెళ్లి వైపు అడుగులు వేయడం చేస్తుంటారు. ఐతే చాలామంది హీరోయిన్లను పరిశీలిస్తే పోస్ట్ సినిమా లైఫ్ చాలా ప్రశాంతంగా ఉండేలా, ఆర్థికంగా ఆలోచించే అవకాశం లేకుండా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ఎక్కువ బడా వ్యాపార వేత్తలను పెళ్లాడుతుంటారు. తమ కంటే ఎన్నో రెట్లు ఆస్తులున్న వాళ్లను ఎంచుకుంటూ ఉంటారు. ఆర్థికంగా తమ కంటే తక్కువ స్థాయిలో ఉన్న వాళ్లను చేసుకునే హీరోయిన్లు చాలా తక్కువ మంది ఉంటారు. శ్రుతి హాసన్ ఈ కోవకే చెందుతుంది.
ఒకప్పుడు యూకేకు చెందిన మ్యూజీషియన్ మైకేల్‌తో ఆమె ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. అతడితో బ్రేక్ అయ్యాక కొన్నేళ్లకు ఇప్పుడు శాంతను హజారికా అనే నార్త్ ఈస్ట్ వ్యక్తితో ఆమె ప్రేమలో పడింది. అతను ఆర్థికంగా చూస్తే శ్రుతి హాసన్‌తో పోలిస్తే తక్కువ స్థాయి వాడే.
శాంతను ఒక డూడుల్ ఆర్టిస్ట్ కమ్ ఇలస్ట్రేటర్. అతనేమీ పెద్ద బిజినెస్ మ్యాన్ కాదు. ఒక ఆర్టిస్ట్. ఐతే మంచి ప్రతిభ ఉన్నవాడు. తన కళతో అద్భుతాలు చేయగల టాలెంట్ ఉంది. ఐతే ఈ ఆర్టిస్టుకి శ్రుతి ఇప్పుడు అండగా నిలుస్తోంది. అతడికి ఫేమ్ తీసుకొచ్చేందుకు తన వంతు ప్రయత్నం చేస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో శ్రుతికి 1.4 కోట్ల మందికి పైగా ఫాలోవర్లుండగా.. వారికి తన బాయ్ ఫ్రెండ్ ప్రతిభను పరిచయం చేస్తోంది.
శాంతను ఆర్ట్ గ్యాలరీలో ఫొటోలు దిగి వాటిని ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు ట్విట్టర్లోనూ పోస్ట్ చేస్తోంది. ఇలా తన ప్రియుడిని ప్రమోట్ చేస్తూ కెరీర్ పరంగా అతడికి సాయపడే ప్రయత్నం చేస్తోంది. శ్రుతికి ఉన్న మాసివ్ ఫాలోయింగ్ శాంతనుకు బాగా ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదు. శ్రుతి, శాంతను ఏడాది నుంచి సహజీవనం చేస్తుండటం విశేషం. త్వరలో వీళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటారని అంటున్నారు.
This post was last modified on June 16, 2021 6:16 pm
ఒక ఢీ.. ఒక రెడీ.. ఒక కింగ్.. ఒక దూకుడు.. ఇలా ఒక దశ వరకు మామూలు హిట్లు ఇవ్వలేదు…
లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి లాంటి చిన్న సినిమాలు పెద్ద విజయాలు సాధించడంలో నిర్మాతలు బన్నీ వాస్, వంశీ…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం తొలిసారి `విజయ్ దివస్` పేరుతో కీలక కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ నెల 9న(మంగళవారం) రాష్ట్ర వ్యాప్తంగా…
ఒకప్పుడు గోవా అంటే యూత్ కి అదో డ్రీమ్ డెస్టినేషన్. ఫ్రెండ్స్ తో ప్లాన్ వేస్తే ఫస్ట్ గుర్తొచ్చేది గోవానే.…
కేరళలో సంచలనం సృష్టించిన నటి కిడ్నాప్ కేసులో హీరో దిలీప్‌కు ఎనిమిదేళ్ల తర్వాత బిగ్ రిలీఫ్ దక్కింది. ఎర్నాకులం కోర్టు…
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ దురంధర్ అన్ని విషయాల్లో సోషల్ మీడియా టాపిక్ గా మారిపోయింది. రిలీజ్ ముందువరకు ఏమంత…