మిల్కీ బ్యూటీ తమన్నా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. దాదాపు స్టార్ హీరోలందరితో కలిసి నటించింది. అయితే ఈ మధ్యకాలంలో ఆమెకి హీరోయిన్ గా అవకాశాలు తగ్గుతున్నాయి. అందుకే ఓటీటీల వైపు చూస్తుంది. ఇప్పటికే ఆమె ‘లెవెన్త్ అవర్’, ‘నవంబర్ స్టోరీ’ అనే వెబ్ సిరీస్ లలో నటించింది. ఈ రెండూ కూడా పెద్దగా వర్కవుట్ కాలేదు. దీంతో ఆమె కథల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది.
ఇదిలా ఉండగా.. తమన్నా ఇప్పుడొక టీవీ షోని హోస్ట్ చేయబోతోందని సమాచారం. ‘స్టార్ ప్లస్’లో ప్రసారమవుతోన్న ‘మాస్టర్ చెఫ్’ అనే కుకింగ్ షో అత్యధిక టీఆర్ఫీ రేటింగ్స్ తో దూసుకుపోతుంది. 2010లో మొదలైన ఈ టీవీ షోని విజయవంతంగా నడిపించారు. ఇప్పుడు ఈ షోని తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో కూడా నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. తెలుగు వెర్షన్ కి వచ్చేసరికి తమన్నాను హోస్ట్ గా తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట.
మిగిలిన అన్ని భాషల్లో మేల్ స్టార్స్ ను హోస్ట్ లుగా తీసుకుంటుంటే తెలుగులో మాత్రం తమన్నాను ఆన్ బోర్డ్ చేయాలనుకుంటున్నారు. దీనికోసం ఆమెకి భారీ మొత్తంలో రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. వచ్చే నెల నుండి ఈ షోకి సంబంధించిన షూటింగ్ ను మొదలుపెట్టనున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. తమన్నా నటించిన ‘సీటీమార్’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అలానే ఆమె నితిన్ నటిస్తోన్న ‘మాస్ట్రో’ సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది.
This post was last modified on June 15, 2021 1:05 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…