కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకి తెలుగులో మంచి క్రేజ్ ఉంది. ఆయన నటించే సినిమాలను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తుంటారు. చాలా కాలంగా సూర్య తెలుగులో ఓ స్ట్రెయిట్ సినిమా చేయాలనుకుంటున్నారు. కానీ సరైన కథలు దొరకకపోవడంతో ఆయన తెలుగు డెబ్యూ ఆలస్యమవుతూ వస్తుంది. ఆయన తమ్ముడు కార్తీ మాత్రం తెలుగు సినిమాల్లో నటించారు. దీంతో సూర్య కూడా తన తెలుగు సినిమా ప్లాన్స్ ను ముందుకు జరిపినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కొందరు దర్శకులు చెప్పే కథలను వింటున్నారు.
దర్శకుడు బోయపాటి శ్రీను ఇటీవల సూర్యను కలిసి కథ వినిపించారని సమాచారం. లాక్ డౌన్ సమయంలో రెండు కథలను సిద్ధం చేసుకున్న బోయపాటి అందులో ఒకటి అల్లు అర్జున్ కి వినిపించగా.. మరొకటి సూర్యకి వినిపించినట్లు తెలుస్తోంది. సూర్యకి కథ నచ్చడంతో ఆయన సినిమా చేయడానికి ఆసక్తి చూపుతున్నారట. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించబోతున్నట్లు సమాచారం. తమిళ నటుడు విజయ్ ని తెలుగు తెరకు పరిచయం చేయనున్న దిల్ రాజే ఇప్పుడు సూర్యను కూడా తెలుగులోకి తీసుకువస్తుండడం విశేషం.
ప్రస్తుతం బోయపాటి ‘అఖండ’ సినిమాను పూర్తి చేసే పనిలో పడ్డారు. అది పూర్తయిన తరువాత బన్నీతో సినిమా చేయాలనేది ప్లాన్. గీతాఆర్ట్స్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. అయితే బన్నీ కాల్షీట్స్ ను బట్టి డిసైడ్ అవుతారు. ఈ సినిమా విషయంలో ఆలస్యం జరిగితే సూర్య సినిమాను పట్టాలెక్కించాలని అనుకుంటున్నారు బోయపాటి. మొత్తానికి ఇన్నేళ్ల తరువాత తెలుగులో సూర్య సినిమా చేస్తుండడం విశేషం.
This post was last modified on June 15, 2021 10:57 am
పుష్ప 2 ది రూల్ మరో అరుదైన రికార్డుని సొంతం చేసుకుంది. కేవలం రెండు వారాలకే 1500 కోట్ల గ్రాస్…
2025లో నిర్వహించనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి ఆతిథ్యంపై నెలకొన్న అనుమానాలు ఎట్టకేలకు నివృత్తి అయ్యాయి. ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్‌లోనే…
మెగా పవర్ స్టార్ అభిమానులకు దిల్ రాజు శుభవార్త చెప్పేశారు. గేమ్ ఛేంజర్ కు పక్కా ప్లానింగ్ తో ప్రీమియర్స్…
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ వ్యక్తిగత జీవితం గురించి విస్తృత చర్చ జరుగుతున్న నేపథ్యంలో, ఈ రూమర్స్‌పై మరోసారి…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం ‘హరి హర వీరమల్లు’ మీద ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని…
రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే అతి తక్కువ స్థాయికి చేరింది. తొలిసారి రూపాయి విలువ రూ. 85.0650కి పడిపోవడం…