టాలీవుడ్ లో సెన్సేషనల్ స్టార్ గా ఎదిగాడు విజయ్ దేవరకొండ. ‘గీత గోవిందం’, ‘అర్జున్ రెడ్డి’ లాంటి సినిమాలతో అతడి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడు విజయ్ తో సినిమాలు తీయడానికి దర్శకనిర్మాతలు క్యూ కడుతున్నారు. గత కొన్నాళ్లుగా ఆయన నటించిన సినిమాలేవీ పెద్దగా ఆడడం లేదు. అయినప్పటికీ విజయ్ క్రేజ్ ఎంతమాత్రం తగ్గలేదు. సినిమాలు, టీవీ యాడ్స్ అంటూ బిజీగా గడుపుతున్నారు ఈ యంగ్ స్టార్. ఇదిలా ఉండగా.. తాజాగా విజయ్ షేర్ చేసిన ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది.
ప్రముఖ ఫోటోగ్రాఫర్ డబూ రత్నాని నిర్వహించిన ఫోటోషూట్ లో పాల్గొన్నాడు విజయ్. డబూ రత్నాని తన కెరీర్ లో ఎంతోమంది బాలీవుడ్ సెలబ్రిటీలతో ఫోటోషూట్లు నిర్వహించారు. బాలీవుడ్ లో ఆయనకున్న క్రేజే వేరు. ప్రతీ ఏడాది డబు రత్నాని సెలబ్రిటీ ఫోటోలతో కూడిన క్యాలెండర్ ను రిలీజ్ చేస్తుంటారు. ఈసారి తన క్యాలెండర్ కోసం విజయ్ ని ఎన్నుకున్నారు. తాజాగా దీనికి సంబంధించిన ఫోటోషూట్ జరిగింది. ఈ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ‘యువర్ బీస్ట్ బాయ్’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు విజయ్ దేవరకొండ.
కండలు తిరిగిన దేహంతో బనియన్ వేసుకొని బైక్ పై కూర్చున్న విజయ్ స్టిల్ అందరినీ ఆకట్టుకుంటుంది. స్టైలిష్ గా కనిపిస్తూనే మాస్ గెటప్ తో మ్యాన్లీ లుక్ తో మెప్పిస్తున్నారు విజయ్. ఈ ఫోటో చూసిన ఆయన అభిమానులు విజయ్ ని తెగ పొగిడేస్తున్నారు. హాలీవుడ్ హీరోల రేంజ్ లో విజయ్ ఉన్నాడని.. ఆయనకు తిరిగులేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం విజయ్.. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘లైగర్’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నారు విజయ్. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.
This post was last modified on June 14, 2021 6:00 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…