భర్త తో గొడవలపై ప్రియమణి కామెంట్స్!

Priyamani

తెలుగులో హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసిన నటి ప్రియమణి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నారు. పెళ్లి తరువాత కూడా ఆమె కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉట్నూన్నారు. ఓ పక్క సినిమాలు, మరోపక్క వెబ్ సిరీస్ లు ఇవి కాకుండా టీవీ షోలకు జడ్జిగాను పని చేస్తున్నారు ప్రియమణి. రీసెంట్ గా ఈమె నటించిన ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ సిరీస్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫస్ట్ సీజన్ తో పోలిస్తే రెండో సీజన్ లో ప్రియమణి పాత్రకు మంచి ప్రాధాన్యత దక్కింది.

అయితే సీజన్ 1 లో అరవింద్, సుచిత్ర పాత్రల మధ్య లోనావాలోలో ఏం జరిగిందనే విషయాన్ని మాత్రం చెప్పనని స్పష్టం చేశారు ప్రియమణి. అది టాప్ సీక్రెట్ అని అన్నారు. ఇక తన కెరీర్ గురించి మాట్లాడుతూ ప్రస్తుతం ‘నారప్ప’, ‘విరాటపర్వం’ లాంటి సినిమాల్లో నటిస్తున్నానని.. రెండు సినిమాల్లో తన పాత్రలు చాలా స్పెషల్ గా ఉంటాయని చెప్పుకొచ్చారు. తన వ్యక్తిగత జీవితం గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

తనకు అద్భుతమైన భర్త దొరికాడని.. ఎంతో సపోర్ట్ చేస్తుంటారని అన్నారు. పెళ్లైన తరువాత ఆయన ఇచ్చిన సపోర్ట్ తోనే సినిమాలు చేయగలుగుతున్నానని తెలిపారు. నిజం చెప్పాలంటే పెళ్లి తరువాత తనకు ఎక్కువ అవకాశాలు వస్తున్నాయని.. నా భర్త నా లక్కీ చార్మ్ అని.. అప్పుడప్పు డు తమ మధ్య గొడవలు వస్తుంటాయని.. ఆ సమయంలోనే ఆయనే తగ్గుతుంటారని ప్రియమణి అన్నారు.

ప్రస్తుతం దర్శకనిర్మాతల మైండ్ సెట్ చాలా మారిందని.. పెళ్లైన హీరోయిన్లకు కూడా అవకాశాలు ఇస్తున్నారని కాజల్, సమంత లాంటి తారలు ఇప్పటికీ స్టార్స్ హీరోయిన్స్ గా కొనసాగుతున్నారని అన్నారు. అయితే పెళ్లైన హీరోయిన్స్ లుక్ పై కొందరు కామెంట్స్ చేస్తుంటారని.. కానీ తనపై ఇప్పటివరకు అలాంటి బాడీ షేమింగ్ కామెంట్స్ రాలేదని స్పష్టం చేశారు.